పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

బసవపురాణము

చారువచోవిలాసంబులఁ దనర - నో[1]రార వారి సన్నుతి సేసి చేసి
వారి మనోలత వడిఁజుట్టిచుట్టి - సారగాంధర్వరసముఁ గ్రోలి క్రోలి
దరహసితాస్య విస్ఫురణయుఁ దనర - హరగణాస్థానంబునం దాడి యాడి
[2]నిక్కంపు [3]భక్తికి నిక్కయై తన్నుఁ - దక్కి [4]యెంతయు భక్తిఁదాఁ జొక్కి చొక్కి
యనవరతము నీప్సితార్థుల కర్థిఁ - దనుమనోధనము [5]లప్పన సేసి చేసి
యందంద పరమతత్త్వానుభవార్థు - లందత్త్వసౌఖ్యజలధి ముంచి ముంచి
ప్రవిమలభక్తి సంపత్సుఖార్థులను - బ్రవిమలభక్తిసంపదఁ దేల్చి తేల్చి
యారంగఁ గామసుఖాపేక్షితులను - శ్రీ(స్త్రీ?)రత్నరాజిఁ బూజించి పూజించి
వరరత్నభూషణోత్కరధనార్థులను - వరవస్త్రభూషణావళిఁ దన్పి తన్పి
రాజవదుపచారపూజనార్థులను - రాజవదుపచారరతిఁ గొల్చి కొల్చి
యష్టాంగభక్తి క్రియాసుఖార్థులను - నష్టాంగభక్తిక్రియలఁ బూన్చి పూన్చి
శీలసంబంధుల శీలంబు లెఱిఁగి - శీలసంబంధ సుస్థితి నుంచి యుంచి
నియమవ్రతాధికనిష్ఠితాత్మకులఁ - బ్రియవస్తుసమితి నర్చించి యర్చించి
బసవఁ డీక్రమమున భక్తిసామ్రాజ్య - మెసకంబుతోఁ జేయునెడ లసత్ప్రీతి
“ముప్పూఁట నోగిరంబులుఁ బదార్థములుఁ - దప్పక కావళ్ల నెప్పుడుఁ బంప
వెండి వేశ్యలయిండ్ల నుండి భోగించు - మిండజంగములు పండ్రెండువే లనిన
నున్న జంగమసంఖ్య [6]మున్ను రూపించి - యెన్నంగ శక్యమే యీశునకైన”
ననుచు భక్తానీక మచ్చెరువంద - ననయంబు భూతిశాసనులాదిగాఁగ
నెల్లభక్తావళి కీప్సితార్థములు - సెల్లించుచును భక్తి సేయుచున్నెడను;

బసవని మేనల్లుఁడు చెన్నబసవని మహిమ


బరమేశుభక్తియ ప్రాణమై పరగు - తరుణి యా నాగాంబవరతనూభవుఁడు
ప్రస్తుతింపఁగ [7]నొప్పుబసవకారుణ్య - హస్తసంభూతప్రశస్తదేహుండు
నసదృశభక్తియోగాత్ముండు చెన్న - బసవండు గురుభక్తిపాత్రోత్తముండు
సర్వాంగలింగి సంసారనిస్సంగి - గర్వాపహారి వ్రాక్తనశివాచారి
సారగుణాన్వేషి సరససంభూషి - కారుణ్యరాశి లింగమనఃప్రవేశి
యగణితసుఖశీలి యతిదయాశాలి - నిగమార్ధసంవేది నిచితప్రమోది
విరహితోభయకర్మి వరలింగధర్మి - యరివర్గసంహారి యాత్మోపకారి

  1. నోరూరి
  2. నిక్కంబు
  3. బ్రీతికి
  4. యెక్కుడు
  5. లొప్పన
  6. మున్నిరూపించి
  7. దగు