పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

33

కక్షకరస్థలకంఠోత్తమాంగ - వక్షస్థ్సలా[1]దికవరలింగధరులు
నుతసంయమీశ్వరు లతులవ్రతస్థు - లతి[2]శీలు రితరపాకాదివర్జితులు
సంభావితులు భవిజనసమాదరణ - సంభాషణాదిసంసర్గవర్జితులు
పరశివధ్యానైకపరతంత్రమతులు - నిరవధిలింగైక్యనిష్ఠితేంద్రియులు
స్వచ్ఛలింగానుభవేచ్ఛాత్మసుఖులు - ప్రచ్ఛన్నలాంఛను ల్ప్రకటలాంఛనులు
నటకులు గాయకుల్ నవరసాత్మకులు - పటుకళావేదులు బహుశాస్త్రమతులు
వాదులు దార్కికుల్ వరకవుల్ దత్త్వ - వేదులు వేదార్థవాదులాదిగను
నెడనెడ నిబ్బంగిఁ గెడఁగూడి నడవఁ - బుడమి యొక్కట నొడ్డగెడవయ్యె ననఁగ
ఖండేందుధరుభక్తగణము లిబ్బంగిఁ - దండతండంబులు దారేఁగుదేర
విలసితమృగమదకలితమార్గముల - వెలుఁగుముక్తాఫలంబులమ్రుగ్గు లమర
ముకురపల్లవమణిముక్తాఫలాది - మకరతోరణముల నికరంబు లలర
ఖ్యాతిగా వృషభసమేతమై యొప్పు - కేతనానీకముల్ గ్రిక్కిఱియంగ
నాతతవ్యాసహస్తాకృతి నున్న - వాత[3]పూరణములు వడిఁ గ్రాలియాడ
నుడువీథిఁ గప్పి సమున్నతలీల - నడపందిరులు వెలి [4]గొడుగులుఁ దనరఁ
దతవితతాదివాద్యంబులు మ్రోయ - నతిశయంబుగ విన్కు లంతంత నమరఁ
బాయక “చాఁగుబళా!" యనుశబ్ద - మాయతి [5]నాకసమంది ఘూర్ణిల్లఁ
బ్రతిదినంబును భక్త బండారిబసవఁ - డతిభక్తిరతి మతి నంకురింపఁగను
శాశ్వతఘనలింగసంపద మెఱిసి - యీశ్వరభక్తుల [6]ని ట్లెదుర్కొనుచు

బసవేశ్వరుని శివాచారనిరతి


మంగళహర్షోదితాంగవిక్రియల - సంగతి నాత్మ నుప్పొంగి యుప్పొంగి
భయభక్తియుక్తిఁ [7]దద్భక్తాంఘ్రిచయము - పయిఁ జక్కఁజాఁగిలఁబడిమ్రొక్కి మ్రొక్కి
పటుతరసద్భక్తపాదాబ్జరేణు - పటలపర్యంకంబు పైఁ బొర్లి పొర్లి
హరభక్తనికరదయామృతవృష్టి - పరిగొని కురియఁ [8]దొప్పఁగఁ దోఁగి తోఁగి
యొడయలదివ్యపాదోదకవార్ధి - నడునీటఁ గడువేడ్కఁ బడి తేలి తేలి
వరభక్తసందోహపరితోషితార్థ - పరమసపర్యసంపద వ్రాలి వ్రాలి
మతిలింగజంగమోచితపరతత్త్వ - సతతశివార్చనారతి సోలి సోలి
శరణనిర్మలనిత్యసత్యప్రసాద - వరసేవనక్రీడ వడిఁ గ్రాలి క్రాలి

  1. నేక, ధిక
  2. శయులి
  3. తోరణములు
  4. గొడగులు
  5. నాకాశమద్రువ
  6. లందెదురుకొనంగ
  7. (క) దొప్పనఁ