పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

23

[1]జతిగీతములమీఁదఁ [2]జప్పట లిడుచు - [3]నతిశయశివభక్తి నాడెడువారు;
నాదిపురాతనాపాదితస్తుతులు - వేదార్థములుగాఁగ [4]వివరించువారు;
నెఱి శివమరులు [5]న గుఱిలేని వేడ్క - నఱిముఱి మిన్నంది యాడెడువారు;
మ్రొక్కి శివానందమునఁ దమ్ము మఱచి - నిక్కపుసుఖమున నిద్రించువారు;
నిఖిలమాహేశ్వరనికరంబు నిట్లు - సుఖలీలఁ గొలువున్నచో బసవయ్య
[6]యప్పాదజలముల నభిషిక్తుఁడగుచు - నొప్పుదివ్యాంబరయుగ్మంబు [7]సాతి
భసితంపునెఱపూఁత పలుచఁగాఁబూసి - నొసలఁ ద్రిపుండ్ర మొప్పెసఁగ ధరించి
మౌళిఁ బ్రసాదసుమంబులు దుఱిమి - పోలఁగ రుద్రాక్షభూషలు దాల్చి
సారమై లింగపసాయితం బనెడు - పేరను గల్గు కఠారంబు గట్టి
యానందబాష్పంబులలుఁగులు వాఱ - మేను రోమాంచ సమ్మిళితమై తనర
“బగుతులపాదుకాప్రతతులు నాకు - నగపడె” నంచు నందంద మ్రొక్కుచును
నొడయల కడుగులు వొడసూపనోడి - [8]మడఁచి వెన్కకుడాఁచి మహినప్పళించి
[9]యూరుల మోఁచేతులూఁది కేల్మొగిచి - వారక యొక్కింత వంగి యుప్పొంగి
తనతొంటి భావంబుఁ దాల్చినయట్టు - లనిమిషుఁడై కన్నులారఁ జూచుచును
భక్తిశృంగార మేర్పడఁ జూఱగొన్న - భక్తికళార్ణవు బసవయ్యఁ జూచి
“యిట్టి ధన్యుఁడ నౌదునే యిప్పు”డనుచు - దట్టుఁడు బలదేవదండనాయకుఁడు
తన కూఁతుఁ గామినీజనతిలకంబు - ననుపమశృంగారవనధి గంగాంబఁ
దోడ్తెచ్చి యట్ల భక్తులకు మ్రొక్కించి - యేడ్తెఱ శుభచేష్టలెదురుకొనంగ
శివభక్తవనితలు సేసలు [10]సల్ల - శివబలం [11]బగ్గలించిన ముహూర్తమున
వేదోక్తశివధర్మవిధి బసవనికి - గాదిలిసుతఁ బెండ్లి గావించె నంత
“నట్టిద కాదె మున్నాదిఁ [12]దలంపు - నిట్టట్ట నావల దిదియె పథంబు
హరునిభక్తులబలంబది లేమిఁగలిమి - హరివిరించులు ద్రుంగుదురు మందు రనినఁ
దక్కిన గ్రహచంద్రతారాబలముల - యెక్కువదక్కువలెన్న నేమిటికిఁ?
గరుణఁ జూచుటయ లగ్నంబు సేయుటయు - వరముహూర్తంబు దీవనయ బలంబు
గాన భక్తులకృప గలదు బసవని - కేనాఁట విందుమే యిట్టి పెండిండ్లు”

  1. జగతీతలము
  2. జప్పటు
  3. నగణిత
  4. వినుతించు; విరచించు
  5. లన
  6. యప్పాట
  7. సాఁతి
  8. మడిఁచి
  9. యూరువుమోఁచేత నూని
  10. వెట్ట
  11. బంగవించిన
  12. దిఁదలంప