పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

బసవపురాణము

ఇట్టి బ్రాహ్మణమార్గమిది దథ్యముగను - బట్టి యాడెదవేని వనియు లేదింకఁ
గాకులు వెంచిన కోకిలపిల్ల - [1]కాకులఁ బోలునే కావుకావనుచు
నెక్కడితల్లి మీ రెక్కడితండ్రి - ఎక్కడితోడు ధర్మేతరులార!
చెన్నయ్య మా తాత చేరమ తండ్రి - పిన్నయ కక్కయ్య బిడ్డ నే ననుచు
వేడుక సద్భక్తి విధి నుండువాఁడ - నేడుగడయు మాకు నిది నిక్కువంబు
మీయంత నుండుఁడు మీరును, నేను - నాయంత నుండెద వేయును నేల"?

బసవేశ్వరుని పెండ్లి


యనుచు సహోదరి యగు నాగమాంబ - యను దాను నచ్చోట నుండఁగాదనుచు
నరుదెంచె మఱి [2]పణిహారియింటికిని - నరులిది సోద్యమనంగ నంతటను
వడుగునకని మున్ను వచ్చినయతఁడు - పడఁతి మాదాంబకు భ్రాత సజ్జనుఁడు
పాండురాంగుని భక్తిపరుఁడు బిజ్జలుని - బండారి బలదేవదండనాయకుఁడు
“శివభక్తునకుఁ బెండ్లి సేయుదుఁగాని భవికి నీ” [3]ననుతొంటిబాసఁదలంచి
“ఇట్టిభక్తునకిప్పుడీక నా కూఁతు - నెట్టివానికి నిత్తు నింక నే” ననుచు
బసవకుమారునిపాలికిఁ బోయి - యెసక మెసఁగఁ గూఁతు నిచ్చి తా మ్రొక్కి
"నా బిడ్డఁ జేకొని నన్ను రక్షింప - వే బసవన్న! మాహేశ్వరతిలక!”
యనుచుఁ బ్రార్థన చేసి యా బసవయ్య - యనుమతంబునఁ బుర మభిరమ్యముగను
మకరతోరణములు మణితోరణములు - ముకురతోరణములు మును గట్టఁబనిచి
“గలయంగ వీథులఁ గస్తూరి యలుకుఁ - డెలమి ముక్తాఫలంబుల మ్రుగ్గులిడుడు
రండు భక్తులఁ బిలువుండు మీ రెదురు - [4]వొండు వేగమతోడి తెండు [5]తెండనుచు
నిట వచ్చునయ్యల కెదురు వచ్చుచును - నట వచ్చునయ్యలకర్థి మ్రొక్కుచును
సింహాసనస్థులఁ జేసి యాకర్మ - సంహారమూర్తుల చరణముల్గడిగి
యవిరళనవ్యపుష్పాంజలు లిచ్చి - ప్రవిమలధూపదీపంబులొనర్చి
యమ్మహాత్ములకు సాష్టాంగుఁడై యక్ష - ణమ్మ విభూతి వీడ్యమ్ములర్పించి
కోలాటమును బాత్రగొండ్లి పేరణియుఁ - గేళిక జోకయు లీల నటింపఁ
బాయక “చాఁగు! బళా!” యను శబ్ద - మాయతి నాకసం బంది ఘూర్ణిల్ల
నలిరేఁగి వేణువీణావాద్యవితతు - [6]లులియుచు లీలతో నొక్కట మ్రోయ
నానందగీతంబు లగ్గించువారు; - పూని శంకరగీతములు వాడువారు;

  1. కాకులువోలెఁ దాగావుకావనునె! ఎ.
  2. హారునింటికిని
  3. నని
  4. కొండు
  5. లెం
  6. లొల