పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

బసవపురాణము

ననుచు లోకంబెల్ల నాశ్చర్యమంది - వినుతింపఁజొచ్చిరి వీరు వా రనక
అంత [1]భక్తాళికి నభిమతార్థములు - సంతుష్టిగాఁబరిచర్య లొనర్చి
సాష్టాంగుఁడై భువిఁజాఁగిలి మ్రొక్కి - శిష్టభక్తాళికిఁజేతులు మొగిచి
“యిల్లకప్పడి సంగమేశ్వరంబందుఁ – దెల్లంబు మా గురుదేవుఁడున్నాడు
చనియెద వారి శ్రీ చరణముల్ [2]గొలువఁ - గనియెద మిక్కిలి కరుణ మీ చేత”
ననుచు సోదరియును నాలును దానుఁ - జనియె నా బలదేవుఁడనుప వేగంబ
అప్పురి బసవఁడల్లంతటఁగాంచి - తప్పక గురుపదధ్యానాత్ముఁడగుచు
గురువున్నపురి దృష్టిగోచరంబైన - ధరఁజాఁగి మ్రొక్కుచు నరిగె నంతంతఁ
గన్నంత నుండి తాఁజన్నంతదవ్వు - నెన్న యోజనమాత్ర మెసఁగి మ్రొక్కుచును
'గుదురుగదా మున్ను గురుభక్తి శివున - కిది యెంతవద్ద దానితని వీక్షింప'
నని యెల్లవారలు నర్థిఁ గీర్తింపఁ - [3]జనఁ జొచ్చెఁ బురిగురుస్తవనంబుతోడ;
నప్పురిమహిమ దా నది యెట్టి దనినఁ - జెప్పఁగ నలవియే శేషునకైనఁ
బురియేఱులన్నియుఁ బుణ్యతీర్థములు - పరగంగ [4]గుహలెల్ల హరునివాసములు
గిరులన్నియును హేమగిరులు దలంపఁ - దరులెల్ల రుద్రాక్షతరువులు గలయ
వనములన్నియుఁ బుష్పవాటిక లచటి - గనులన్నియును భూతిగనులు [5]దెల్పార
[6]గొలఁకులన్నియు నొప్పు జలజాకరములు - కల గోవులన్నియుఁ గామధేనువులు
గోడెలన్నియు నందికుఱ్ఱ లాపురము - వాడలన్నియు రంగవల్లి వేదికలు
నరులెల్ల భక్తులు చిరజీవులెల్లఁ - బరికింపఁ గారణపురుషరూపములు
స్త్రీలెల్లఁ బరమపతివ్రతామణులు - నే లెల్ల [7]నవిముక్తనిధిసమానంబు
పలుకులెల్లను దత్త్వభాషలు జనుల - యులు వెల్ల గీతవాద్యోత్సవరవము
కల్లరి పతితుండు ఖలుఁడు దుర్జనుఁడు - ప్రల్లదుఁ డఱజాతి భక్తిహీనుండు
వికలుండుఁ గొండీఁడు వెదకిననైన - నొకఁడు కప్పడిసంగమేశ్వరంబందు
సడిసన్న కూడలిసంగమేశ్వరుని - గుడికేఁగి [8]తన్ను భక్తు లెదుర్కొనంగ
గుడిముందటను నిల్చిగురులింగమూర్తి - యడుగులకపుడు సాష్టాంగుఁడై మ్రొక్కి
వేదపురాణార్ధవిమలసూక్తులను - నాదంబు పూరించి నలిఁబ్రస్తుతింపఁ

  1. భక్తావళి కభి
  2. గొలిచి
  3. జనిచొచ్చెఁ
  4. గుళ్ళెల్ల
  5. వొల్పార
  6. కొలను
  7. నదిముక్తినిధి
  8. తనుభక్తు లెదురుకొనంగ