పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

బసవపురాణము

పు. 200 నిట్టపాటు= నిలువునఁబడుట.

పు. 160 నిట్రించు= నీల్గు

పు. 107, 147 నెట్టోడు= భయపడు, గజిబిజిపడు.

పు. 124 నెఱవణి = ప్రశస్తి,

పు. 84 పక్కిళ్లు = ప్రక్కలు.

పు. 135 పటవలి=వస్త్రము.

పు. 164 పడికివల్చు = దుర్గంధముగొట్టు.

పు. 61, 152 పడిగము= పళ్లెరము, పాత్రము ( తమ్మ యుమియునదే కాదు)

పడిహారి = పణిహారి, పడితెచ్చువాఁడు, వేత్రహస్తుఁడు.

పు. 21 పదకవాదము = కల్పితవాదము, కవితాకల్పనము.

పు. 212 పదరు = దబ్బనము?

పు. 238 పదువ = తృణభేదము.

పు. 64 పనువు = పనవు

పు. 140, 108 పన్న= అధముఁడు, సేవకుఁడు.

పు. 228 పన్ను = పల్లము, చౌడోలు, (ఏనుంగు పన్నగునే గాడిదలకు)

పు. 66 పరిచ్ఛేది = శిరచ్చేదసన్నద్దు (ఁడు) రాలు.

పు. 86 పరిసెనమువాఁడు = స్పర్శచేయువాఁడు.

పు. 124, 178 పశువరించు = హింసించు.

పు. 38, 232 పసిగ= పసి ( పసిక అనియు)

ప్రామిఁడి = గయ్యాళి, ధూర్తుఁడు.

పు. 55 పాదిగ = పాతిక.

పు. 86 పాయగొమ్ములు = చెట్టు పంగటికొమ్మలు 'పాయగొమ్ముల నల్లఁ బట్టు దగిల్చి యక్కొన యాకుపై వెండికోరవెట్టి' - ఉత్తరహరివంశము.

పు. 179 పిట్టపిడ్గఱ = పిట్టపిడుగు,

పు. 242 పుప్పించె= పుచ్చఁజేసెను.