పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

153

పు. 18, 20 పురులు = సౌందర్యము, కీర్తి, ధనము.

పు. 82 పూన్చు= పూజించు

పు. 43 పెంట్రుక = పెట్రిక.

పు. 31 పెంట= పేఁట.

పు. 43 పెఱికసెట్టి= శాసనములందు 'పెఱుక సెట్టి' కలదు.

పు. 22 పేయ= పెయ్య.

పు. 240 పొట్టపోర్వు= కడుఁజేరువ.

పు. 128 పోలగు= ఒప్పు

పు. 103 పోడేర్చు= భూమిని గృష్యనుకూలముగాఁ జేయుటకై పుట్ట పొదరు మొదలగువానిఁగొట్టి తగులఁబెట్టు.

పు. 71 పోలెలు= పోళీలు.

పు. 60 మనికులు= స్థిరులు.

పు. 189 ప్రేలగింపులు= ప్రేలుటలు.

పు. 82 పాదొ(దు)ట్రు = సాలెపట్టు.

పు. 202 భ్రమరించు = చుట్టివచ్చు.

పు. 22, 226 లింగపసాయితము= లింగప్రసాదితము. వీరశైవులు చేత ధరించు ఖడ్గము.

పు. 74 వంపుడుగట్ట= కరకట్ట

పు. 19 వట్టిపాటు= వ్యర్ధము

పు. 123 వదిగొను = వరుసపెట్టు

పు. 204 వయ్యు = వైచు.

పు. 136వ ఫుట్‌నోటు చూచునది. (వలయెత్తి నీటిలో వయ్యంగఁ దడవ, వలఁగొని మఱునాఁడు వయ్యంగఁ దొలుత.)

వరువుడు, వరుపుడము, వరువు, వర్వు = దాస్యము.

పు. 149 వలివేగము (వలవేగము, అనియుఁగలదు) = కడువేగము.