పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

బసవపురాణము

పు. 210 కొత్తి = స్త్రీ, (కొత్తి, గోఁతికూడా ఉన్నది. హరివం)[1]

పు. 145 కొయ్యనగాండ్రు = మూర్ఖులు,

పు. 112 కొసనక = కొసనక్క (దేవత పేరు)

పు. 84 కోడిఱెప్ప = ఱెప్పలో దుర్మాంసము పెరుగు నేత్రవ్యాధి,

పు. 124, 230 కోలాస = రిత్తకోరిక, దురాశ,

పు. 105 క్రిగ్గాలి = క్రిక్కుగాలి, తప్పుగాలి.

పు. 245 క్రియగొను = పనిగొను.

పు. 191 క్రుమ్ముడి = కుఱుముడి (క్రొమ్ముడి శబ్దములేదు)

పు. 85 క్రేకన్ను = క్రేవకన్ను, కడచూపు, కటాక్షము ('క్రే' తర్వాత అరసున్న లేదు. క,గ, కాలేదు).

పు. 237 క్షణియించు = అర్పించు.

పు. 30 గజ్జెపరుపు = ?

పు. 216 గట్టిగ బావులు = ఏతపు నూతులు.

పు. 32,146 గనియ = గని? కండపట్టు? 'అన విని మేటి ధర్మమగు నట్టిది యెయ్యది, యెట్టిదెప్పుడున్ | గనియగఁ బండియుండు' అరణ్యపర్వము ఆశ్వా. శ. ర. లో ' కనియ= మాఁగబండు ” అని యీ ప్రయోగమే యాధారముగాఁ గలదు. ఇక్కడను 'గనియ' కాఁ దగునని నాతలఁపు. 'ఆ చేను గనివలెఁబండినది' అనుట కలదు.

పు. 183 గఱిగొను = ముతైపుఁ జిప్ప జలబిందువును దాల్చు

పు. 97 గామిడి= గడుసరి

పు. 71 గుడగుడలు = సంశయము.

పు. 32, 224 గుడ్డ = గుట్ట.

  1. ఈ పట్టున శాస్త్రిగారిట్లు గుర్తించుకొనిరి ( ప్రకాశకులు)