పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

149

పు. 102 గెలిగొను = గేలిగొను.

పు. 65 గొంతి = కాంత

పు. 240 గొఱుపడము = కంబళి

పు. 74 గోరంతప్రొద్దు = ఓరంతప్రొద్దు

పు. 234 చక్కిలించు = చక్కిలిగింత చెందు

పు. 160 చిఱలువొడుచు = (పశువులు) నేలగోరాడుచు రేఁగిపరువెత్తు.

పు. 209 చెరలు = ఉప్పొంగు.

పు. 69 చేకళ్లు= చేతిముద్దలు.

పు. 222 జంగెత = జంగమురాలు

పు. 61 జక్కొల్పు = సమకూర్చు.

పు. 224 జరగడుగు= జలగడుగు, (నేఁడు జలగడుగుజాతి వారనఁబడు వారికిఁ బూర్వము 'జరగడుగువా' రనియే పేరయి యుండును)

పు. 107 జాడము = తుండము?

పు. 134 జాణత = చాతురి

పు. 71 జాత్ర = జాతర, ఉత్సవము.

పు. 107 ఝాళి సేయు = జాడించు.

పు. 74 టెంకణము = గోపురము?

పు. 215,226 తండు = నిస్సారము.

పు. 195 తందె = అయ్య.

పు. 76 తథ్య = సత్యము.

పు. 68,119 తఱుచంటి = దుడుకువాఁడు. శ - రలో తఱుసలియని యీ పదము గ్రహింపఁబడినది. తఱుసలి పై నౌపవిభక్తిక ప్రత్యయముచే తఱుసంటి మాటలు' అని నన్నయ ప్రయోగించెనని సీతారామాచార్యులవారు దలంచిరి. కుమారసంభవమున 'తఱుచంటి దన్ను నెదిరిని నెఱుఁగఁడు' అని 'తఱుచంటి' యే ప్రకృతిగాఁగానవచ్చుచున్నది. సోమనాథుని ప్రయోగములు నన్నిచోడ ప్రయోగరీతినే సమర్థించుచున్నవి.