పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

147

పు. 72 కట్టుగ్రము = కడు+ ఉగ్రము,

పు. 103 కట్టుగ్రుఁడు,

పు. 100 కట్నము = వస్త్రము,

పు. 116 కడయింటి పొడున = అతిసంసారుఁడయిన పోటుమానిసి,

పు. 102 కనుమరి = కమ్మరి,

పు. 7 కన్నెఱుఁగు = జాడయెఱుఁగు,

పు. 150 కలకేత విద్య,

పు. 149 కలకేత వేషము = ఇంద్రజాల విద్య,

పు. 112 కల్లచ్చులు = తప్పుటచ్చులు,

పు. 101 కల్లవెల్ల = గజిబిజి,

పు. 188 కవణము = పొర, అడ్డు,

పు. 183 కసిమసి = గజిబిజి (గసియుమసియు)

పు. 102 కాకఱపులు = వదరులు,

పు. 120 కింగాణము = నైచ్యము,

పు. 72, 163, 232 కుడుక = కోర, గిన్నె,

పు. 178 కుతగలు[1] = కుతజ్‌జ్ఞులు, దుర్విజ్ఞానులు,

పు. 107 కాయకము = వర్తకము, పనిపాటు, ఇది సంస్కృత సమాసమున 'కాయకలబ్ది' ఇత్యాది విధములఁ గలదు. 'ప్రాయపుఁ గాయకుల్ వలె' విజయవిలాసము

పు. 112 కొట్నము = ధాన్యము.

పు. 13 కొత్తడి = స్త్రీ సమూహము, "పుణ్య చరిత్ర గులాగ్రగణ్య గొత్తడి సకలంబు” ఉద్యో. ప.

  1. కించిజ్‌జ్ఞులు, అతజ్‌జ్ఞులు, కుతజ్‌జ్ఞులు అని నేనన్నాను, సూర్యరాయవారు సితగులు, అతగులు, కుతగులు- ఇన్నీ ఉన్నవి గాన అతగులు = హతకులు అన్నారు, చేయి దిగండిట్టి సితగుండుగలడె పుట, 69 కన్నడమున సితగుడు = వ్యభిచారి. తెలుగున - ధూర్తుఁడు.