పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

బసవపురాణము


గుంపు (శర-చూ) అని యాముక్తమాల్యదలోఁ గలదు. బసవపురాణమున 'ఆసరు' అవి యతిలో 'ఆ' కలదు. ఆముక్తమాల్యదలోఁగూడ 'వేసరి యాసరి దాసరిగుంపు' అని యుండవలయునేమో! 121 - నాసికము. దీని ముకారాంతముగాఁబలువురు ప్రాచీనకవులు ప్రయోగించిరి.

పు. 109 అదిగొమ్మనుచు = అదిగో+ అనుచు; అదిగో, ఇదిగో, వీఁడుగో, వాఁడుగో అను రూపములు గలవు. 'కొనుము' కు, కొమ్ము, కో, అను రూపములు గలవు. అదిగొనుము= దానిని గ్రహింపుము, చూడుము' అని యర్థము. 'కొనుము' రూపాంతరమగు 'కో' అగుటచే నాపదము కళగాని ద్రుతాంతముగాదు. 'అది| గో కానంబడియెఁ దెల్లగొల్లెనభంగిన్' అని వరాహపురాణమునఁ గలదు. పింగళిసూరన దాని ద్రుతాంతముగాఁ బ్రయోగించుట చింత్యము. 'మనసు మ్రుచ్చిలి చొచ్చిన మత్తికాఁడు | వీఁడు గొమ్మని- ఉత్తరహరివంశము. అదిగో ఇత్యాదులున్నట్టే అదివో, ఇదివో, వాఁడువో, వీఁడువో రూపములును గలవు. ఇక్కడ, 'పో పొమ్ము రూపాంతరము. వాఁడుగో, వీఁడుగో రూపముల యునికిని గొందఱు సందేహించుచున్నారు. పిల్లలమఱ్ఱి వీరన శాకుంతలమునను, జైమిని భారతమునను దానిని ప్రయోగించెను. వాఁడుగో మాయన్న వంశవర్ధనుడు | నేఁ డేల మది దప్పెనెలఁతరోనీకు, పల్నాటి వీరచరిత్ర - 'పేరు నేతిబీఱకాయ విలుచుకొందురు గాని చేరిచూడఁబోతె నెయ్యి చిక్క దందులో | ఈ రీతి బ్రాహ్మణుల పద్దు నెన్నఁగా నేమియుగద్దు! వాఁడుగో మాదరచెన్నవరుఁడె బ్రాహ్మణుఁడు' - చిలుకపాటివారి వచనములు

పు. 124, 178 'పశువరించు' ఈ పదము నన్నయ రచనలోఁగూడఁ గలదు. 'నీ యట్లు క్రూరులై నృపతులఁ జెఱఁబెట్టి పశువరించుచుఁ బశుపతినుమేశు! వరదుఁ బూజించినవారును గలరె' సభాపర్వ. 1 ఆశ్వా. 'తనయుఁబశువఱిచి తద్వప | గొనివేల్చినఁ జూచి' అరణ్య. 3 ఆశ్వా. మొదటి ప్రయోగమున హింసించు బాధించు అనియు, రెండవదాన యజ్ఞపశువునుగాఁ జేసి చంపు అనియు నర్థము పొందుచున్నది. పశువఱుచు, 'పశువరించు'