పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

141

పు. 240 వదరు - 'ఒదవంగ వఱ్ఱేట నోడయుండంగ- వదరూఁదినట్లు' వదరు= సొఱకాయబుఱ్ఱ, నన్నయ ప్రయోగ మిది చూడఁదగును. 'అందు వైదర్భికి నొక్క యలాబూఫలంబును శైబ్యకు నసమంజసుండను కొడుకునుం బుట్టిన ఆ|| 'వరదుఁడైన యీశువరమున నిది యొక్క, | వదరు వుట్టె నెట్టి వరమొ యనుచు | దానిఁ బాఱవైవఁగానున్న' - అరణ్య. 3 ఆశ్వా..

పు. 219 బ్రహ్మపురులు = దేవాలయములలోని స్వస్తివాచక బ్రాహ్మణులు. “సోమేశ్వరదేవర బ్రహ్మపురుల సానుల వృత్తులు ఒక్కొకళ్ళకు ఖ 3” ఇది శక. 1075 నాఁటి నన్నిచోడ శాసనము[1] -మఱియు చేఁబ్రోలి శాసనమున 'దేవర బ్రహ్మపురి బ్రాహ్మలు 14 కు' ఇత్యాది.

పు. 40 కైకొనిపి (కైకొనఁజేసి) 'మేలుకొనిపి' - శ్రీనాథుఁడు.

207 పు. కూఁతురివరియింప' కూఁతురు శబ్దము ప్రథమేతర విభక్తులలో 'రు' లోపించునని కేతన యనెను. 'పరగఁగూఁతురు శబ్దంబుపై రుకార! మొక్క పలుకున పైనైన నుండుఁబాయు' నని విన్నకోట పెద్దన చెప్పెను.

పు. 121 మఱియట్లనేమెచ్చి - అట్లన్ అనికూడఁ బ్రాచీన ప్రయోగములు గలవు గాఁబోలును! 221 మల్లజియ్య, బొల్లజియ్య - దేవళములందర్చకులుగా నుండు తమ్మళ్లకు 'జియ్య' లని వ్యవహారము. పెక్కు శాసనములందుఁ దమ్మళ్లు 'జియ్య'లని పేర్కొనఁబడిరి.

30 పు దృష్‌ట్లు- ఈ రూపమును నన్నయకూడఁ బ్రయోగించెను. దృష్‌ట్లు భ్రష్‌ట్లు, రూపములు ప్రాచీనతరకవి సమ్మతములు.

95 పు. కొల్చురగ సంఘములు (కొల్చునురగ') అని యుండవలసినది.

69 పు. అనియొండె వేసరనాసరఁగన్న జననిఁగదాయని - వేసరను, ఆసరను అని ఛేదము. 'కుక్షింభరిత్వంబున క్షుత్‌క్షాములై వేసరియోసరి దాసరి

  1. 1915 సం. గవర్నమెంటువారి శాసన సంచయము. నెం 363