పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

బసవపురాణము

పు. 145 'ఈఁజుమ్ముర' (తుమున్నంతముగాదు. )

పు. 65 'లేనెత్తి'

పు. 114 'ఏనుంగుగోల్పడె' కోల్పడె=పోయె,

పు. 194 అతఁడదృశ్యముగ = అదృశ్యముకాఁగా

పు. 195 చోళవాళి వేళవాళి, -

ఈ పదముల కర్థమెఱుఁగరాదు. 'చోళవాళిక కాక క్షోణీతలేశ- వేళవాళికిఁ గర్తవే' అని పండితారాధ్యచరిత్రమునను గలదు. దీనిఁగూర్చి శివతత్త్వసారపీఠికలో శ్రీ కె.వి. లక్ష్మణరావుగా రిట్లు వ్రాసిరి. "చోళవాళి = చోళపాళి, చోళరాజ్యము. వేళవాళి = వేళపాళి =కాలపాళి = కాలునిరాజ్యము. అని నే నర్థము చేసికొంటిని. కాని, అర్థము స్పష్టమనుటకు వీలులేదు.” కన్నడ కవిచరిత 1 వాల్యుం 24 పుటలో 'చోళవాళి' ని గూర్చి చర్చకలదు. అది యిట్టిది :- ఈ (చోళవాళి) శబ్దమును రైస్ చోళ రాజ్యమని భ్రమించినట్లు తోఁచుచున్నది. ఈ శబ్దమునకు ఋణము లేక బాధ్యత అని యర్థమని యీ క్రింది ప్రయోగములఁబట్టి స్పష్టమగుచున్నది. “జోళదపాళియంపగెదు దిల్లా ద్రోణనుంద్రౌణియుం - రన్నకవి. జోళదపాళిగెన్న సువనిత్తాఖ్యాతియం తాళ్దువెం - కర్ణపార్యుఁడు. సలహిదొడయన చోళవాళిగె తలెయ మారువుదొండుపుణ్య - కుమారవ్యాసుఁడు”- ఈ ప్రయోగముల నన్నింటిని జూడఁగా నా కిట్లర్ధము తోఁచుచున్నది. చోళవాళి = జొన్నల కయిన నిర్ణయము. వేళవాళి - జీవితకాలమున కయిన నిర్ణయము. అనఁగా, 'జీతము (తిండికి జొన్నలు) ఇచ్చినందులకుఁ జేయవలసిన సేవకే నీవధికారివి గాని, జీవితకాలపు విధానమున కెల్ల నధికారివి కా' వనియర్ధము. చోళ మనఁగా జొన్నలు. వాళి =వతను, ఏర్పాటు, నిర్ణయము. కన్నడమున 'చోళదవాళి' యని యుండుటచేత నది షష్ఠీసమాసము. ఆ కాలమున రాజసేవకులకు జీతము జొన్నలిచ్చుచుండి రనుటకు నన్నిచోడని ప్రయోగము - మునుమిడి వైరివాహినులముట్టి........... జొన్నలు గొన్న ఋణంబు నీఁగుదున్. కుమారసం. 11 ఆశ్వా.