పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

139


రూపములను లిఖించిరనఁగూడదు. కొన్నిచోట్ల నట్లు జరిగియుండవచ్చును గాని సర్వత్ర యట్లగుట యసంభవము. నన్నయ భారతమునఁ బెక్కు ప్రతులందు 'అగు' పాఠమే కానవచ్చుచున్నదిగదా!

మఱికొన్ని

పు. 145 'ఇగ మెడ దునియెదవు' - ఇందలి 'ఇగ' అరసున్న లేనిది. చిన్నయసూరి ప్రభృతు లిది సానుస్వార మనిరి

పు.159 'ప్రెబ్బొంత పెయ్యల పెద్ద' - పెరు- బొంత- పెద్దబొంత గలవాఁడు - పెర్బొంత- ప్రెబ్బొంతయయినది. పెర్గడ ప్రెగ్గడ అయినట్టు

పు. 147 - 'కల్లోలంబునొందె' - ఇత్యాదులు పెక్కులు -

పు. 179- 'అర్ఘ్యపణ్యములు' - ఇది పెక్కుచోట్లు: 'అర్ఘ్యపాద్యము' లనుటకు,

పు. 242 - అర్ధరాత్రి, అర్ధరాత్రమనుటకు పు.

147- పసిఁడిమయము, తమమయము,

పు. 156- పర్సవేదులు,

29, 31 కట్టనిచ్చు, కట్టఁగనిచ్చి

ఇట్టి వ్యవహారమునేఁడు లేదు. నేఁడు 'కట్నమిచ్చుట' యనియే కలదు. సోమనాథుఁడు 'కట్నమిచ్చుట' గూడఁ బ్రయోగించెను. సత్కరించి యొసఁగెడు వస్త్రమునకుఁగట్నమని తొలుతఁ బేరై నేఁడది వస్త్రములేకపోయినను, సత్కరించి యొసఁగు భూమ్యాభరణాదులకుఁగూడ వాచకమయినది. సోమనాథుఁడు కట్నమును వస్త్రసామాన్యవాచకముగాఁగూడ వాడినాఁడు

పు. 101. 'ఎట్టి కట్నంబైన నిచ్చి మ్రొక్కుచును' - ఇక్కడ కట్నమనఁగా 'ఉదికిన గుడ్డ' యే; కట్టునది (వస్త్రము), కట్టము, కట్టనము, కట్నము, అనురూపములఁజెందినది. కొట్టము, కొట్టనము, కొట్నము= ధాన్యము; రాటము, రాట్టము, రాటనము, రాట్నము= నూలియంత్రము- ఈ శబ్దము లిట్టివే