పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

బసవపురాణము

పు.135 - నెరియల పాలైనఁ బురహర నీకు- సోమనాథుఁడు. శ.ర.కారులు, ఏర్పడు, ఏర్పఱుచు, ఏర్పరించు, వెల్వడు, వెల్వఱుచు, వెల్వరించు-ఇత్యాది విధముల 'పఱుచు' రూపాంతరమగు 'వరించు' ను సాధురేఫముగా గ్రహించిరి. యుద్ధమల్లుని శాసనము మూఁడవ యక్కరలో 'వెల్వఱించిన నశ్వమేధంబు' అని బండిఱా కలదు. 'తివురు' శ. ర. 'తివుఱు' అని యుద్ధమల్లశాసనము. ముందర, ముందఱ-లు భారతముననే కలవు వేఱువేఱుకాదు. పేరు + పేరు, పేరువేరు; పేర్వేరు, వేర్వేరు, అని ప్రాచీనుల ప్రయోగములు. ఎరఁగు ఎఱఁగు కలదు. పడమర పడుమఱు, రెండు దెఱఁగులను గలదు. రేఫద్వయ పరిజ్ఞాన మీ తెఱఁగున నఱవఱలై (అరవరలనియుఁ గొందఱనిరి) యున్నది. పర్యాప్తమయిన పరిశీలనమునకిది పట్టుగాదు. ఈ గ్రంథము ముద్రణమున నిట్టి చీకాకుగలశబ్దములు కొన్నింటిని గొన్నిపట్టుల నటునిటుగాఁగూడ నుంచితిని. మఱియు బండిఱా సంయుక్తమైనపుడు నన్నయనాఁట బండిఱాగానే వ్రాఁత యుండెడిది. మన సోమనాథుఁడు మొదలగువారు సంయుక్తమయిన సాదురాతో దానిని బ్రాసములందుంచిరి. నేఁటిలిపిలో సంయుక్తమయిన బండిఱా సాదురా గానే యున్నదిగాన నేనట్లే యుంచితిని.

అవగాగమము - నన్నయభారతమున పూరణార్థమున 'అవ' కానరాదు. 'అగు' కలదు. 'మూఁడగు పర్వము, ఇత్యాదులు. ఆ కాలపు శాసనములలో హెచ్చుగా 'అవు' కాననగును. 'మూఁడవునడపున, రెండవుకొడుకు' ఇత్యాదులు. అగు, అవులకు భేదములేదుగదా! తర్వాత, 'అవ' 'ఔ' అను రూపములు గూడ నేర్పడినవి[1]. సోమనాథుని కాలమునకే 'అవ' రూప మేర్పడినది.

పు. 123 - ఇచ్చమైఁ బదుమూఁడవేటి యంత్యమున' అని కలదు. 'అగు అవు' లున్నచో 'అగునేటి, అవునేటి' అని యుండును. 'అవ' రూపముమీఁదనే 'మూఁడవది' అయినట్టు 'మూఁడవేఁడు' అయ్యెను. పెక్కుచోట్లఁ బూరణార్థమున సోమనాథుఁ 'డవ' ప్రయోగించెను. ఏ వ్రాతప్రతిలోను 'అగు"అవు' రూపములు గానరాలేదు. లిపికారులు కవిప్రయుక్త రూపములను మార్చి తమకాలపు

  1. దక్షిణ హిందూదేశ శాసనములు 4 సంపుటము. చూ.