పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

బసవపురాణము


జాతులు మాత్రానుసంధానగణవి
నీతులుగాన యనియతగణైర
నియును బ్రాసో వా యనియు యతిర్వా
...............................................................
అతిశయప్రీతి బ్రహ్మాండపురాణ
మతమహోమోహస్యమాహాత్మ్య మన మొ
దలఁద్రిపుండ్రం మోక్షదం త్యక్త మనవి
రళ మేతదన్యత్ర రమతే యనఁగ ను
చితసూక్తి యట్ల వాసిష్ఠలైంగంబు.

(పండితారాధ్యచరిత్రము)

ఇట్లు గూర్చుట పండితారాధ్యచరితమందే హెచ్చుగాఁ గానవచ్చును. బసవపురాణమున నేద్విపద కాద్విపద విడఁబడియే యున్నది.

ఇది యిట్లున్నను నీతఁడు, దర్వాతికవు లంతగాఁ బాటింపనిదియు, నన్నయరచనమందుఁ దిన్నఁగా నెన్నఁదగియున్నదియు నగు సీసరచనావైలక్షణ్యమును అనుభవసారమునను, జతుర్వేదసారమునను జక్కఁగాఁ బాటించినాఁడు. మఱియు క్రౌంచపదవృత్తమున, నన్నిచోడనికంటె నెక్కువ నియమమును బాటించినాఁడు.

చంచుల నాస్వాదించుచు లేఁదూం డ్లకరువుప్రియలకు నలఁదుచు మైరో..

- నన్నిచోడఁడు.

భక్తివినీతుల్ యుక్తిసమేతుల్ భవభయనిపతిత పశుగణపూతుల్...

- సోమనాథుఁడు

ఇందు నన్నిచోడని రచనమున చరణము రెండుదళములై మొదటిదళమునఁ బ్రాసయతియు, రెండవదళమున వేఱుగా యతియుఁ గల్గియున్నది. సోమనాథుని రచనమున నింత కెక్కువగా ద్వితీయదళమున యతి ప్రథమదళ