పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

111


ప్రథమాక్షరమునకనుగుణమైనదిగా నున్నది. అర్వాచీనకవులెల్లరు నీ విధానమునే యనుకరించిరి.

ప్రాసవిశేషములు

సోమనాథుని గ్రంథములలో నితర(భవి)కవికృతులం దంతగాఁ గానరానివి ప్రాసవిశేషములు గొన్ని గానవచ్చుచున్నవి. నన్నయాదుల కృతులలోఁ బ్రాసములందు హల్‌సామ్యము తప్పక కాననగును. అనఁగాఁ బ్రథమచరణ ద్వితీయాక్షరమున నెన్ని హల్లులు సంయుక్తములుగా నున్నవో యన్ని సంయుక్త హల్లులును దక్కిన మూఁడుచరణములందును గూడ ద్వితీయాక్షరమునఁ గూడి యుండును. మల్లికార్జునపండితుఁడు మొదలగు శివకవు లీ నియమము నంతగాఁ బాటింపరయిరి. కతిపయ హల్ సామ్య మున్నఁ జాలునని వీరు దలంచిరి.

క. నమ్మిన భక్తుఁడు గన్నడ
   బమ్మయ సద్భక్తి మహిమ పరికింపఁగ లో
   కమ్ములఁ జోద్యముగాదె య
   ధర్మంబును ధర్మమయ్యెఁ దత్త్వాతీతా!

ప్రాఁతవ్రాఁతలలో “ధమ్మన్” యని యుండును.

క. ఇవ్వసుమతిఁ గడుఁగమ్మని
   పువ్వులలోఁ బుట్టి నట్టి పువ్వులు గొఱయే
   సర్వజ్ఞభక్తి విరహితుఁ
   డెవ్వఁడు నుత్కృష్టజాతుఁ డేటికిఁగొఱయే.

-శివతత్వసారము.



   “మర్త్యలోకమునకు మఱి వేఱె యొకఁడ
    కర్తయున్నాఁడె లోకత్రయవరద!”

    “మధ్యాహ్నమగుటయు మారయ్య లింగ
    తద్ద్యానసుఖ నిరంతర వర్తియగుచు.”