పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

బసవపురాణము


సంశయింపఁబనిలేదు. ఈ యర్థమునకు సాధకములయిన విషయములు పెక్కులు బసవపురాణమునఁగూడఁ గలవు.

వీరశైవము

వీరశైవులు "శివలింగం కరాద్యంగే వీరశైవస్తు ధారయేత్” అను విధి చొప్పున లింగధారణము చేయుదురు. ధరించిన యాలింగమునకుఁ బ్రాణలింగమనియు, నిష్టలింగమనియుఁ బేరు. అది లోపించెనేని గండగత్తెఱ వేసికొని చనిపోవలసినదే కాని వారు జీవించియుండరాదు.

ప్రాణలింగవ్రతే లుప్తే ప్రాయశ్చిత్తం న విద్యతే,
ప్రాణత్యాగాత్పరం తస్మా త్సావధానేన ధారయేత్.
ప్రాణలింగే చ విచ్ఛిన్నే లింగే ప్రాణాన్ పరిత్యజేత్,
ప్రతిదీక్షాం ప్రాప్య తిష్ఠేద్రౌరవం నరకం వ్రజేత్.

సిద్ధాంతశిఖామణిలోఁ బ్రాణలింగ మనఁగా నంతర్లింగ మనియు, నిష్టలింగ మనఁగా బాహ్యలింగ మనియు, కరపీఠార్చన ముత్తమమనియుఁ గలదు. 'ఇష్టలింగ మిదం స్థూలం యద్భాహ్యేధార్యతేసదా, ప్రాణలింగంతు తత్ సూక్ష్మం యదంతర్భావనామయమ్. బాహ్యపీఠార్చనా దేత త్కర పీఠార్చనం వరమ్'.

వీరశైవ మద్వైతసిద్ధాంతము ననుసరించును.
శివేన సహ సంబంధా చ్ఛైవమిత్యాదృతం బుధైః,
ఉభయోస్సంపుటీభావా ద్వీరశైవ మితి స్మృతమ్.
వీ శబ్దే నోచ్యతే విద్యా శివజీవైక్య బోధికా,
తస్యాం రమంతే యే శైవా వీరశైవాస్తు తే స్మృతాః
స్వయం లింగాంగసంబంధీ శివ ఏవ న చాపరః.

ఇట్లు చెప్పియు సిద్ధాంతశిఖామణికారుఁ డద్వైతమతమును గర్హించెను. అద్వైతమునఁ జేరినచో బాహ్యలింగార్చనము మానివేయుటగును గాన యా మతము పనికిరాదనెను. సర్వాద్వైతమని, యీశ్వరాద్వైతమని భేదముఁ జెప్పి