పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

97


యీశ్వరాద్వైతమే తగును కాని, సర్వాద్వైతము తగదనెను. మల్లికార్జున పండితారాధ్యుఁడుగూడ నీ యద్వైతభేదముఁ జెప్పెను.

వీరశైవులు జాతిభేదము పాటింపరాదు.

శ్లో. ఏకపీఠం జగత్సర్వ మేక మాకాశమాలయమ్,
    ఏకతోయం సదా పీత్వా జాతిభేదం న కారయేత్.
    అమరంగ నటుగాక యఖిలమర్త్యులకు
    సమము ధాతువులును సమము పిండములు
    సమము సూతకములు సమము జన్మములు
    సమము నిద్రాహారసంగకృత్యములు
    సమము మోహభయాభిషంగలోభములు
    సమ మింద్రియవిషయసముదాయములును
    సమము లీభూతపంచకములు నవయ
    వములును సుఖదుఃఖవాసనల్ సమము
    లదిగాక ధర యేక మఖిలజీవులకు
    తుద నాకసంబు పొత్తు సమస్తమునకు
    తోయ మొక్కటి జగత్తునకుఁ బ్రాపింప
    నైయుండుఁ గులభేదమైన లాగెట్లు.
          * * * * *
    సద్రతి బ్రాహ్మణక్షత్రియవైశ్య
    శూద్రకులీను లంచును బల్కె దీవు
    ఎక్కడ వారికి నేతెంచెఁ గులము
    టక్కరు లాడుమాటలుగాక యనిన.

- దీక్షాబోధము.

ఇట్లు వీరు జాతిభేదమును గర్హించి యా కాలమున ననేకుల లింగధారులఁగాఁ జేసి వారినెల్లర నొక్కపొత్తునకుఁ దెచ్చి తమమతమున కభ్యుచ్ఛ్రేయమును