పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

81

పండితుని వంశవృక్షమును నేఁటి శివలెంకవారియొద్ద నెందేని కలదేమో! మంచెనపండితుఁడు శ్రీపతిపండితున కించుక తర్వాతికాలమున నుండెను.

మల్లికార్జునపండితుఁడు

ఈయన చరిత్రము ప్రసిద్ధమే. ఈ పీఠికలో నింతకుముం దక్కడక్కడఁ గొంతప్రస్తుతము నయ్యెను. గోదావరీతీరమందలి దాక్షారామ మీయన జన్మదేశము. ఈయన పెక్కుగ్రంథముల రచియించెను. అందు శివతత్త్వసార మను తెల్గుకృతి నొకదాని నేను ప్రాచ్యలిఖితపుస్తకశాలకై సేకరించితిని. ఇప్పుడు మఱియొక 'శ్రీముఖదర్శనగద్య' మనుదానిఁ గనుఁగొనఁగల్గితిని. దాని యాద్యంతము లిట్టివి:

ఆది :-

శ్లో. త్రైలోక్యస్య భవానేవ నిగ్రహానుగ్రహక్షమః;
    శ్రీవిశ్వేశ్వర మాం పాహి మహేశ్వర! నిరీశ్వర!

జయజయ రుద్ర, వీరభద్ర, విరించిపంచమశిరఃఖండన, యజ్ఞపురుషశిరఃఖండన! -

అంతము :

మల్హణప్రియ, బల్లాణప్రియ, కుమ్మరగుండయ్యప్రియ, అఖిలభువనభక్తజనప్రియ, దేవా! సురపతిప్రముఖ నిఖిల ప్రార్థితప్రథన పరమేశ్వర, దేవా నమస్తే నమస్తే నమః.

శ్రీమాన్ మాహేశ్వరశ్శిష్టో మల్లికార్జునపండితః;
శ్రీముఖదర్శనగద్యం హృద్యం గ్రథితవాన్ (?)

శైవమతము

క్రీస్తు పుట్టుకకుఁ బూర్వమున నుండియు, అనగా రెండువేల యేండ్లకుఁ బూర్వమున నుండియు దక్షిణాపథమున శైవవైష్ణవమతములు పేర్వెలయుచున్నవి. ప్రధానముగా వైష్ణవమతమునకు ద్రవిడదేశమందును, శైవమతమునకుఁ