పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

బసవపురాణము

    లని కోపశిఖివీక్షణాగ్రప్రచారియై
                 గరిగొని విస్ఫులింగములఁ దనుప
    బొమలు గంటిడ ధరాభ్రమణంబుచే దిశల్
                 కుమ్మరిసారె చందమ్ము నెఱప

గీ. గగనభాగంబునం దిరుల్ గ్రమ్ముకొనఁగ
    సర్వజీవౌఘమును సభాసదులు మూర్చ
    నొంద నప్పండితేంద్రుఁ డత్యుగ్రవేగ
    సరణి లంఘించెఁ దన్మహాస్థానవీథి.

వ. అప్పండితేంద్రుండు జయవాటికాపురమల్లికార్జునాగ్నేయభాగంబున నున్న శమీశాఖి సమీపంబునకు నరిగి యద్దేవున కభివందనంబును ప్రమథగణస్తోత్రంబును గావించి వీతిహోత్రు నాకర్షింపుచుఁ దనమీఁది పట్టుపచ్చడంబునం గట్టి యిట్లనియె.

మ. వినుమీ పావక, శైవగేహములలో విశ్రాంతి దక్కన్ బురం
     బున నెందున్ వసియింప కీ కుజనవిస్ఫూర్జన్మదంబున్ హరిం
     పు నగేంద్రాలయునాజ్ఞ దప్పి యనయంబున్ మీఱినన్ వీరభ
     ద్రునిచే నీకగు బన్నమున్ దెలియఁగా దొడ్డాడ నింకేటికిన్.

(అట్లు శ్రీపతిపండితుని యానచొప్పున గ్రామమున నగ్నికరవయ్యెను. అనంతపాలదండనాథాదులతో నెల్లరును వచ్చి శరణార్థులయిరి. వారము దినములయిన పిదప శ్రీపతిపండితుఁడు శమీవృక్షపుఁ గొమ్మను వ్రేలఁగట్టిన పచ్చడపుమూటను విచ్చి యగ్నిదేవుని విడిచిపుచ్చెను. పండితుని మాహాత్మ్యమున కచ్చెరువంది యనేకులు తచ్ఛిష్యులయిరి. తదాది శ్రీపతిపండిత సంప్రదాయమువారికి బెజవాడ యాస్థానమయ్యెను.)

శివలెంక మంచెనపండితుఁడు (పుట. 197)

శివలెంక యింటిపేరివా రారాధ్యబ్రాహ్మణులు నేఁడును బ్రఖ్యాతులుగా నాంధ్రదేశమందుఁ గలరు. శ్రీపతిపండితారాధ్యుని వంశవృక్ష మున్నట్టే మంచెన