పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

బసవపురాణము

మాహాత్మ్యమును ప్రకటించి యక్కడి జైనమఠముల నేణ్ణూఱింటిని జెడఁగొట్టించెను. అప్పుడు రాజుతో నక్కడి జైనులెల్లరుగూడ శైవమత మవలంబించిరి. పొట్లచెఱువు బళ్లారి మండలమందుఁ గలదు. కొలిపాక యెక్కడిదో యెఱుఁగరాదని ప్లీటుదొరగారు వ్రాసిరి. కాని యది నిజాం రాష్ట్రాంధ్రదేశమున నున్నది.

హలాయుధుఁడు - ఈతఁడు చిఱుతొండనికి సమకాలమువాఁడని కలదు. చిఱుతొండఁడు క్రీ.శ.630 వాఁడని గుర్తించితిమి గాన, యీతఁడు నాకాలమువాఁ డగును. హలాయుధస్తవమని యీతఁడు రచియించిన శివస్తవము (పంచస్తవిలో నొకటి) కలదు. హలాయుధ నిఘంటు వీతని దగునో కాదో?

ఉద్భటుఁడు- పు. 219 శైవులెల్లరు నీతని స్తుతింతురు.

క. హరలీలాస్తవరచనా
   స్థిరనిరుపమభక్తిఁ దనదుదేహముతోడన్
   సురుచిరవిమానమున నీ
   పురమున కుద్భటుఁడు ప్రీతిఁ బోవఁడె రుద్రా!

శివతత్త్వసారము.



క. క్రమమున నుద్భటుఁడు గవి
    త్వము మెఱయఁ గుమారసంభవము సా(నా?)లంకా
    రము గూఢవస్తుమయకా
    వ్యముగా హరలీలఁ జెప్పి హరు మెప్పించెన్.

నన్నిచోడ కుమారసంభవము.

ఉద్భటారాధ్యచరిత్ర[1] మని తెనాలి రామలింగకవి యీతని చరిత్రమునే తెలుఁగునఁ బద్యకావ్యముగా రచియించెను. తెలుఁగుదేశమున నుద్భటారాధ్య

  1. ఇది సరస్వతీ పత్రికలో (ముక్త్యాల) ముద్రితమయినది. విశేష విషయములు విపులముగా దానికి నేను వ్రాసిన పీఠికలోఁ జూడదగును.

    (చూ. పుటలు 79- 97. ప్రకాశకులు)