పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

73

పరంపరవా రారాధ్యులు పలువురున్నారు. ముదిగొండవా రుద్భటారాధ్య పరంపరవారని యుద్భటారాధ్యచరిత్రమునఁ గలదు. ఆతఁడు ఘూర్జరదేశమునఁ గల బల్లకిపురవాస్తవ్యుఁడని బసవపురాణాదులందుఁ గలదు. కాశ్మీరరాజగు జయాపీడునిసభలో విద్యాపతిగా నుండెనని (క్రీ. శ. 779 నుండి 813 వఱకు)

వంశవృక్షము

[1]శ్రీపతిపండితుఁడు

|

గోకర్ణుఁడు

(పంచముని ద్విజునిఁగాఁ జేసెను)

|

మల్లికార్జునుఁడు

(శిష్యార్థమై కృష్ణాజలము నింకించెను. )

|

చినమల్లికార్జునుఁడు

(ఎనుఁబదేండ్ల సువాసినికిఁబుత్త్రునిఁ బుట్టించెను)

|

పండితుఁడు

|

గోకర్ణుఁడు

|

మల్లికార్జునుఁడు

(తత్పరంపరలో)

|

లింగన

  1. శ్రీపతిపండితుని యనంతరము బహుపురుషాంతరములదాఁక నీ వంశమువారు బెజవాడవాస్తవ్యులు గానే యుండిరి. ధర్మగుప్తాభ్యుదయాదిప్రబంధకర్తకాలమునఁ గాఁబోలును ఎలకుఱ్తి నగ్రహారముగాఁ బడిసి వారు బెజవాడ వీడి తమ యగ్రహారమున వసింపఁజొచ్చిరి. శ్రీ నాగేశ్వరరావు గారు నేఁడు బెజవాడలో దివ్యసౌధమును గట్టించి తత్థ్సానవాస్తవ్యులై యెనుబదివందల యేండ్లకంటె నెక్కువకాలము నుండి తమవంశము వారికిఁ జెల్లుచున్న ప్రాచీనపుఁగాణాచిని మరల నిలుపుకొన్నారు.