పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

71

నరసింగ మునయర్‌ -పు. 121 శిరత్తుణెనాయనార్, రణమిత్రుఁడు అని కర్ణాటసంస్కృతగ్రంథములందు నామాంతరములున్నవి. అందు నరసింగ మునయర్ కథ వేఱుగా నున్నది.

కొట్టరువుచోడఁడు - పు. 121 కుట్టులినాయనార్.

పూసలనాయనారు - పు. 140 పోసల నాయనార్.

మంగయక్కరశి -పు. 176, 177 సుందర పాండ్యుని భార్య. (పొగ్హళ్ కరయూరి) చోడనికూతుఁరు.

అఱువదిమూగురలో ద్రవిడకర్ణాటగ్రంథములందు వర్ణితులలో బసవపురాణమునఁ గానవచ్చినవారిని బయిఁబేర్కొంటిని. ద్రవిడకర్ణాటగ్రంథములందుఁగానవచ్చువారు కొందఱు మన బసవపురాణమునఁ గానరాకున్నారు. బసవపురాణమునఁ గానవచ్చువారు గొందఱు ద్రవిడకర్ణాటగ్రంథములందుఁ గానరాకున్నారు. కథలలోఁగూడఁ గొన్ని భేదములుగలవు. ఆయా విషయములు సమగ్రముగాఁ జర్చించుట కిది చోటుగాదు.

మఱికొందఱు

శంకరదాసయ్య, తేడరదాసయ్య, దుగ్గళవ్వ - వీరు మువ్వురును సమకాలమువారు. పు. 111,114, 181,199 పశ్చిమచాళుక్యరాజయిన జగదేకమల్లుఁడు (ఈతఁడే రెండవ జయసింహవల్లభుఁడు. దేసింగుఁడు, సింగబల్లహుఁడు అని పేర్కొనఁబడినవాఁడు నీతఁడే), కళ్యాణకటకమునఁ బంచలోహములతోఁ బోతఁపోయించి నెలకొల్పిన విష్ణుప్రతిమను దృష్టించి జడయశంకరస్థానవాస్తవ్యుఁడైన శంకరదాసయ్య తుత్తునియలు చేసెను. ఈ సింగబల్లహుని భార్యయే సుగ్గళదేవి. ఈమె శైవమతస్థురాలు. తేడరదాసయ్య యీమె గురుఁడు. తన మాహాత్మ్యమును ప్రకటించి తేడరదాసయ్య సింగబల్లహుని శైవునిఁగాఁ జేసెను. పొట్లచెరువు, కొలిపాక యనుపురము లాతని రాజ్యస్థానములుగా శాసనములందుఁగలదు. పొట్లచెరువులోనే తేడరదాసయ్య