పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

ప్రపంచ చరిత్ర


పాలాయెను. తగిన తిండి దొరకలేదు. ఆ సైన్యము గ్రీసును చేరుకోలేక వెనుకకు మరలిపోవలసివచ్చినది. క్రీ. పూ. 400 సంవత్సరమున రెండవ దండయాత్ర జరిగెను. ఈ సారి భూమార్గమునువదలి సముద్రముపై ప్రయాణముచేసి ఏథెన్సుకు సమీపమందున్న మారథాన్ ఆను ప్రదేశమున సేనలు దిగినవి. పర్షియాసామ్రాజ్యముయొక్క కీర్తి దివ్యంగా వెలుగుచుండినందున ఏథెన్సు ప్రజలు చాల భయపడిరి. అందువల్ల వారు తమ ప్రాత శత్రువులైన స్పార్టనులను మంచి చేసుకొని తమకు ఉమ్మడి శత్రువైన పర్షియాను జయించుటకు తోడ్పాటుకోరిరి. స్పార్టను సహాయము రాక పూర్వమే ఏథెన్సుసైన్యము పర్షియనుల సైన్యము నోడించెను. ఇదియే ప్రసిద్ధమగు మారథాన్ యుద్ధము. క్రీ. పూ. 490 లో ఇది జరిగినది.

ఒక మహాసామ్రాజ్య సైన్యములను ఒక చిన్న గ్రీకునగరరాష్ట్ర మోడించుట వింతగా కనుపించును. కాని కనిపించినంత వింత ఇందులో లేదు. గ్రీకులు తమదేశమువద్ద, తమదేశముకొరకు పోరాడిరి. పర్షియసుల సేనలన్ననో తమ చేశమును దాటి ఎంతోదూరము వచ్చి పోరాడినవి. పర్షియన్ సామ్రాజ్యపు అన్నిభాగములనుండి ప్రోగుచేయబడిన కలగూరగంప పర్షియనుల సేనలు . జీతములు పుచ్చుకొనుచుండుటచే వారు పోరాడిరి. గ్రీసును జయించవలెనను ఆకాంక్ష వారి కంతగా లేదు. ఏథెస్సు సేనలన్ననో తమ స్వాతంత్ర్యమును నిలుపుకొనుటకు పోరాడినవి. స్వాతంత్ర్యమును గోల్పోవుటకన్న చాపు మేలని వారెంచిరి. ఏయుద్యమముకొరకైనను ప్రాణములొడ్డువారికి అపజయముండదుకదా !

మారథాన్‌వద్ద డరయస్ పరాజయమందెను. తరువాత నాతడు పర్షియాలో దేహమును చాలించెను. అతని తరువాత జవక్సస్ చక్రవర్తియయ్యెను. జరక్సస్ కూడ గ్రీసును జయించవలె నని ఆసించెను. ఇందుకై అతడొక దండయాత్రను సన్నద్ధము చేసెను. ఈ సందర్భమున హెరొడోటస్ చెప్పిన మనోహరమగు వృత్తాంతమును నీకు వినిపించెదను. జరక్ససు పినతండ్రిపేరు ఆర్టబానస్. గ్రీసుపై దండయాత్ర సాగిం