పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పర్షియా : గ్రీసు

93


చిన పర్షియాసేనలకు ప్రమాదము కలుగునని అతడూహించెను. గ్రీసుపై యుద్ధము చేయవద్దని జర్‌క్ససు కాతడు బోధించెను. జరక్ససు సమాధానమిట్లిచ్చెనని హెరొడోటస్ చెప్పుచున్నాడు -

"నీవు చెప్పిన మాట సబబైనదే. కాని మనము చేయు ప్రతికార్యమందును విపత్తుండునని నీ వూహింపరాదు. ఆపదలసు నీవు గణించరాదు. వచ్చిన ప్రతికార్యమును గూర్చియు ఇది మంచిదా, చెడ్డదా, యని తర్కించుచుపోయిన నీవే కార్యము నెన్నటికిని చేయలేవు. ఆపదలు తటస్థించునేమో యని బెంగపెట్టుకొని కూర్చుండి. ఎట్టి కష్టములను అనుభవించక యుండుటకంటె సర్వ యత్నములందును మేలునే చూచుట తటస్థించిన కష్టముల నెదుర్కొనుట మంచిది. ఎదుటివాడు చేసిన ప్రతి ఉపపాదనను, ఆదరింపదగిన సక్రమమార్గమును చూపకుండ, నీవు ఖండించుచుపోయిన ఎదుటవానితోపాటు నీవును కష్టములపాలగుదువు. హెచ్చుతగ్గులు లేకుండ తుల నిలిచియున్నది. ఏవైపుముల్లు వంగునో సామాన్యమానవుడు నిష్కర్షగా ఎట్లుచెప్పగలడు? చెప్పలేడు. పూని పనిచేయువానికే సామాన్యముగా భయము చేకూరును. సంశయాత్ములగుభీరువులను విజయలక్ష్మి వరించదు. పర్షియా ఎంతటి గొప్పసామ్రాజ్యమైనదో చూచితివా? సింహాసనము నధిష్టించిన నా పూర్వులు నీవు చేయుచున్న ఆలోచనల వంటి ఆలోచనలే చేసియుండిన పక్షమందును, లేదా వారట్టి ఆలోచనలు చేయకున్నను, నీవంటి మంత్రులు వారి కుండియుండిన పక్షమందును మన సామ్రాజ్య మింత గొప్పదగుట సంభవించదు. ఆపదలను లక్ష్యపెట్టకుండుట చేతనే మనల నింతటివారినిగా వారు చేయగలిగిరి. గొప్ప ఆపదల ద్వారానే ఘనకార్యములు నిర్వహింపబడుచుండును."

పర్షియారాజు ఎట్టివాడో పై వృత్తాంతమునుబట్టి మనము తెలిసికోవచ్చును. అందువల్లనే దీర్ఘముగా నున్నను పైవాక్యముల నెత్తి వ్రాసితిని. చివరకు ఆర్టబానస్ చెప్పిన ప్రకారమే జరిగినది. పర్షియనుల సైన్యము గ్రీసులో ఓడిపోయినది. జరక్ససు ఓడిపోయెను. కాని అతని మాటలు నేటికిని పరమసత్యములే. మనము నేర్చుకోవలసిన విషయము లందున్నవి. నేడు. మహత్కార్యములను సమర్థించ పయత్నించుచున్న