పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పర్షియా : గ్రీసు

91


నుంచిరి? సరే, సరే, చదువు, నాయినీ చెరసాలనుండి నేను చేయగల సహాయమును చేయుదును. నీ మనస్సు, శరీరము ఎంత వేగముగా వృద్ధి చెందుచున్నచో అని నేను తరుచు అనుకొనుచుందును. నేను నీవద్దనుండిన నెంత బాగుండును! నేను వ్రాయుజాబులు నీకు చేరులోపుగా నీవు ఇందలి విషయములకు మించిన జ్ఞానమును సంపాదించియుందువేమో. అప్పుడు [1]చంద్రకు ఈ జాబులను చదువు ఈడు వచ్చును. కాబట్టి ఎవరో ఒకరు చదివి విషయమును గ్రహించవచ్చును.

మరల మనము గ్రీసుకు, పర్షియాకు పోవుదము. వారి అన్యోన్య యుద్ధములను గూర్చి విచారింతము. గ్రీకుల నగర రాష్ట్రములను గూర్చియు, డరయస్ రాజు పరిపాలన క్రిందనున్న పర్షియా మహా సామ్రాజ్యమునుగూర్చియు ఇదివరలో ఒక జాబులో చర్చించియుంటిమి. డరయస్ సామ్రాజ్యము వైశాల్యముననేకాదు, రాజ్యాంగ నిర్మాణము నందుకూడ చాల గొప్పది. అది ఆసియా మైనరునుండి సింధునదివరకు వ్యాపించినది. ఈజిప్టు, దాని యంతర్భాగమే. ఆసియా మైనరులోని కొన్ని నగరరాష్ట్రములు కూడ లందులో చేరినవే. ఈ పెద్ద సామ్రాజ్యమందంతట చక్కని బాటలున్నవి. బాటలగుండ నిత్యము, వేళకు, చక్రవర్తి తపాలు పోవుచుండెను. ఏకారణమువల్లనో డరయస్ గ్రీకుల నగర రాష్ట్రములను జయింప నిశ్చయించెను. ఈ సంగ్రామములలో చరిత్రలో ప్రసిద్ధికెక్కిన యుద్దములు కొన్ని జరిగినవి. ఈ సంగ్రామముల వృత్తాంతములు గ్రీకు చరిత్రకారుడగు హెరోడోటస్ వ్రాసెను. అతడు తానువ్రాసిన విషయములు జరిగిన కొద్దికాలము తరువాతనే ఉండేను. అతడు గ్రీకుపక్షపాతి. కాని అతని వ్రాతలు చాల మనోహరముగా నుండును. ఈ జాబులలో క్రమేణ ఆతని చరిత్రనుండి కొన్ని వాక్యములను ఉదహరించు చుందును.

గ్రీకులపై పర్షియనులు చేసిన మొదటి దండయాత్ర విఫల మాయెను. ఇందుకు కారణము-పర్షియన్ సైన్యము త్రోవలో రోగముల

  1. ఇందిర మేనత్తకూతురు చంద్రలేఖ పండిట్.