పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రగుప్తమౌర్యుడు : అర్థశాస్త్రము

111


వేసెను. తక్షశిలను స్వాధీనముచేసికొని, చంద్రగుప్తుడు మిత్రరాజులతో కదలి దక్షిణముగా పాటలీపుత్రముమీదకు వెళ్ళి నందరాజు నోడించెను. ఇది క్రీ. పూ. 321 సంవత్సరమున. అలెగ్జాండరు మరణించి సరిగా అయిదుసంవత్సరము లైనపిమ్మట సంభవించెను. ఈసంవత్సరము నుండి మౌర్యవంశపరిపాలనము ప్రారంభమయ్యెను. చంద్రగుప్తుని మౌర్యుడనుటకు కారణము స్పష్టముగా తెలియదు. తల్లి పేరు ముర కాబట్టి మౌర్యుడయ్యెనని కొందరందురు. అతని మాతామహుడు రాజుగారి మయూరపాలకు డనియు, అందుచే అతనికి మౌర్యుడని పేరు వచ్చిన దనియు మరికొంద రందరు. ఆపేర్లు ఎట్లు వచ్చినను ఆతనికి మాత్రము చంద్రగుప్తమౌర్యు డను పేరు వచ్చినది. వేరొక చంద్రగుప్తుడు అను మహారాజు కొన్నివందల సంవత్సరములతరువాత ఇండియాలో నుండెను. వీరిద్దరికిని భేదము తెలియుటకై అతనికి చంద్రగుప్తమౌర్యుడను పేరు నిలిచియుండును.

భారతదేశము నేకచ్చత్రాధిపర్యముగా నేలిన చక్రవర్తుల పేళ్ళను మహాభారతము, ప్రాచీనగ్రంథములు, ప్రాచీనగాథలు పేర్కొనుచుండును. ఆ కాలమునుగురించి మనకు స్పష్టముగా తెలియదు. భారతవర్షము యొక్క విస్తీర్ణ మెంతో కూడ చెప్పలేము. ప్రాచీన రాజుల పౌరుషము నతిశయోక్తులతో పైగాథలు వర్ణించియుండవచ్చును. అవి ఎట్లున్నను ప్రబలమై నలుగడలు విస్తరిల్లిన మొదటి సామ్రాజ్యము హిందూదేశమున చంద్రగుప్తమౌర్యుని సామ్రాజ్యమే యని చరిత్ర మనకు చెప్పుచున్నది. ఇది మిక్కిలి యభివృద్ధిజెంది, శక్తివంతమైయుండెనని ముందుముందు తెలిసికొందము. అట్టి రాజ్యమును, దొరతనమును తటాలున తలయెత్తినని చెప్పుట అసంభవముకదా! చిరకాలమునుండియు తదనుగుణముగా ఎన్నోకార్యములు జరిగియుండవలెను - చిన్నరాజ్యములు కలిసిపోవుట, రాజనీతి వృద్ధియగుట మున్నగునవి.

చంద్రగుప్తుడు రాజ్యముచేయుచున్నకాలమున, ఆసియామైనరు నుండి ఇండియావరకు నున్న దేశమునకు వారసు అయిన అలెగ్జాండరు