పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

ప్రపంచ చరిత్ర


రాజధాని పాటలీపుత్రము. దీనినే ఇప్పుడు పాట్నా అందురు. మనము పరిశీలించుచున్న కాలమున నందవంశమునకు జెందిన రాజులు మగధను పాలించుచుండిరి. అలెగ్జాండరు ఇండియా వాయవ్యప్రాంతముపై దాడిచేసినప్పుడు నందరా జొకడు పాటలీపుత్రమునందుండెను. బహుశా రాజునకు బంధువగు యువకుడొక్కడు - చంద్రగుప్తుడనువా డచ్చట నుండెను. చంద్రగుప్తుడు మిక్కిలి తెలివైనవాడును, సమర్ధుడును. అత్యాశకలవాడును అయియుండునని తోచుచున్నది. నందరాజునకాతనిపై ఇష్టము లేకపోవుటచేతనో, అతడు చేసిన పనివిని సమ్మతించకపోవుట చేతనో అతనిని తన దేశమునుండి బహిష్కరించెను. చంద్రగుప్తుడు ఉత్తరముగా తక్షశిలకు పోయెను. అలెగ్జాండరును గురించి, గ్రీకులను గురించి చెప్పుకొనుచున్న కథలు బహుశా అతనిచెవిని బడినవికాబోలు. అతనితో మిక్కిలి సమర్థుడగు బ్రాహ్మణు డొకడుండెను. అతని పేరు విష్ణుగుప్తుడు. అతనిని చాణుక్యుడనికూడ అందురు. చంద్రగుప్తుడును, చాణుక్యుడును ఏమి సంభవించినను విధికి తలయొగ్గి సంచరించు సాదేశీలురు కారు. ఉన్నతస్థితికి వచ్చుటకై వారెన్నో గొప్పయోచనలు చేయుచుండిరి. వానిని ఆచరణలోపెట్టి విజయము నందగోరుచుండిరి. అలెగ్జాండరు ప్రతిభకు బహుశా చంద్రగుప్తుడు విమోహితుడై, అతని అడుగులలో నడువగోరియుండును. తన కార్యములందు తోడ్పడుటకు చాణుక్యు డుండెను. అతడు అసాధారణ ప్రజ్ఞాశాలి. కూరిమి చెలికాడు. మంత్రిసత్తముడు. ఇద్దరును జాగరూకులై తక్షశిలలో జరుగుచున్న ప్రతివిషయమును శ్రద్ధతో గమనించుచుండిరి. తరుణమునకు వేచియుండిరి.

అవకాశముకూడ వారికి త్వరలోనే వచ్చెను. అలెగ్జాండరు మరణవార్త తక్షశిల చేరుటతోడనే కార్యసన్నద్ధు డగుటకు తరుణము వచ్చినదని యాతడు గ్రహించెను. అచ్చటి ప్రజల నాతడు ప్రబోధించి వారి సహాయముతో అలెగ్జాండరచ్చట నిలిపిన సేనలపైబడి వారిని తరిమి