పుట:నాగార్జున కొండ.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

నా గార్జున కొండ


కృష్ణానదిలో ఎన్నో ఉపనదులు, వాగులూ కలుస్తాయి ఒక్క టెజవాడ దగ్గరనే ఏడాది మొత్తం మీద ఎల్లప్పుడూ 1716 T. M C అడుగుల నీళ్ళు ప్రవహిస్తూంటాయి. ఈ నదికి సంబంధించి ఇదివరకే కొన్ని ప్రణాళికలు సాగుతున్నవి. వీటి వల్ల ఉపయోగపడే నీరూ, ప్రస్తుతం ఉపయోగ పడుతూన్న నీరూ మొత్తం పోను ఇంకా 970 T. M. C. అడుగుల నీరు మిగిలి వృథాగా పోతూంది.

ఈ మిగిలే నీటిని ఉపయోగించే నిమిత్తం సిద్ధేశ్వరం, నందికొండ, పులిచింతల అనే చోట్ల నదికి అడ్డకట్టలు కట్టాలి అని ఒక పధకం ఉన్నది. సిద్ధేశ్వరంకట్టవల్ల 8.64 లక్షల ఎక రాల భూమినీ, నందికొండకట్టవల్ల 31.38 లక్షల ఎకరాల భూమినీ, పులిచింతల కట్టవల్ల మరికొన్ని లక్షల ఎకరాల భూమిని సాగు చెయ్యడానికి సరిపోయే నీరు లభిస్తుంది. ఇది కాకుండా ఈ కట్టల వల్ల 175,000 K.W.ల విద్యుచ్ఛక్తి నికూడా ఉత్పత్తి చెయ్య వచ్చును.

పైన చెప్పబడిన స్థలాలు అన్నిటిలోకీ నందికొండ వద్ద కట్ట కట్టడం సుకరమూ, లాభదాయకమూను. నందికొండ అనే గ్రామంవద్ద నదికి అడ్డంగా కట్ట కడతారు.ఈ స్థలం అటు మాచర్ల రైలు స్టేషనుకు 10 మైళ్ళదూరంలోనూ, ఇటు మిరియాల గుడా దేవరకొండ రోడ్డుకు 10 మైళ్ళదూరంలోనూ ఉన్నది. ఈ కట్ట 8,880 అడుగుల పొడుగు వుంటుంది. దీనిమూలాన కృష్ణా నది నీరు 110 చదరపు మైళ్ళదూరం ఎగువకి వ్యాపిస్తుంది. ఈ నీటిని