పుట:నాగార్జున కొండ.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గార్జున సాగరము

33


నదికి కుడివైపున ఒకటీ, ఎడమవైపున ఒకటి రెండు కాలువలు తవ్వి వాటిలోకి మళ్ళిస్తారు. కుడివైపున కాలవ 276 మైళ్ళ పొడుగు ఉంటుంది. దీనిమూలాన గుంటూరుజిల్లాలోని సత్తెనపల్లి నరసరావుపేట, ఒంగోలు తాలూకాలు పూర్తిగానూ, పల్నాడు. వినుకొండ, గుంటూరుతాలూకాలు కొంతవరకునూ, నెల్లూరు జిల్లాలో కందుకూరు, కొవ్వూరు, కావలితాలూకాలు పూర్తిగానూ, దర్శి, పొదిలి, కనిగిరి. ఉదయగిరి, ఆత్మకూరు తాలూకాలు కొంత వరకూనూ కర్నూలు జిల్లాలో కొద్దిభాగమూ సాగుబడిలోకి వస్తాయి ఎడమవైపు కాలవ 140 మైళ్ళ పొడుగు ఉండి హైదరాబాదు రాష్ట్రంలోని వరంగల్లు, నల్లగొండ జిల్లాలలో కొంత భాగానికీ ఆంధ్రరాష్ట్రంలో కృష్ణాజిల్లాలోని నందిగామ తాలూకాకీ వ్యవ సాయానికి నీరు అందిస్తుంది.

ఈ నందికొండ కట్ట కట్టడానికి తొమ్మిది సంవత్సరాల కాలం పడుతుంది. దీని నిర్మాణానికి 21.28 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.

ఈ కట్టవల్ల ఇప్పుడు బీడుపడివున్న భూమిలో కొన్ని లక్షల యెకరాల నేల సాగుబడిలోకి వస్తుంది. ఇందువల్ల ఎక్కువ ఆహారధాన్యాలు ఉత్పత్తి అయి కరువు కాటకాల బాధ చాలావరకూ తగ్గుతుంది. ఈ కట్టమూలంగా తయారయే విద్యు చ్ఛక్తివల్ల చాలా ప్రదేశానికి దీపాలసౌకర్యమూ. పరిశ్రమలకి శక్తి సౌకర్యమూ, లభిస్తుంది. కాని దీనినిర్మాణంవల్ల ఆంధ్రదేశ చరిత్రకూ. ఆంధ్రదేశకరాచరిత్రకూ, ఆంధ్రదేశమతచరిత్రకూ