పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారెవరైనను ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబదుదురు.

నిప్పు, లేక మండునట్టి పదార్థము విషయమున నిర్లక్ష్య ప్రవర్తన.

285. నిప్పు లేక ఏదేని మండునట్టి పదార్ధముతో మనుష్యులకు ప్రాణాపాయము కలిగించెడు లేక ఏ ఇతర వ్యక్తి కైనను ఘాతనుగాని హానిని గాని కలిగించగల రీతిలో దుడుకుగా లేక, నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేసెడు, లేక తన స్వాధీనములో ఉన్న ఏదేని నిప్పుతో లేక ఏదేని మండు నట్టి పదార్థముతో మనుష్యులకు బహశః కలుగగల ప్రాణాపాయమును నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తను ఆట్టి నిప్పు, లేక మండునటి పదార్థము విషయములో ఎరిగియుండియుగాని నిర్లక్ష్యముతో గాని, తీసికొనకుండెడు, వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయల దాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ప్రేలుడు పదార్థము విషయమున నిర్లక్ష్య ప్రవర్తన.

286. ఏదేని ప్రేలుడు పదార్థముతో మసుష్యులకు ప్రాణాపాయము కలిగించెడు. లేక, ఏ ఇతర వ్యక్తి కైనను ఘాతనుగాని, హానిని గాని కలిగించగల రీతిలో దుడుకుగా, లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేసెడు,

లేక, తన స్వాధీనములో ఉన్న ఏదేని ప్రేలుడు పదార్ధముతో మనుష్యులకు బహుశ: కలుగగల ప్రాణాపాయము నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తను అట్టి పదార్థము విషయములో ఎరిగియుండియు గాని నిర్లక్యము తో గాని, తీసికొనకుండెడు,

వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

యంత్రసామగ్రి విషయమున నిర్లక్ష్య ప్రవర్తన,

287. ఏదేని యంత్రసామాగ్రితో, మనుష్యులకు ప్రాణాపాయము కలిగించెడు, లేక ఏ ఇతర వ్యక్తికైనను ఘాతనుగాని, హానిని గాని కలిగించగల రీతిలో దుడుకుగా లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేసెడు,

లేక, తన స్వాధీనములో ఉన్న, లేక తన వశమునందున్న ఏదేని యంత్రసామాగ్రితో మనుష్యులకు బహుశః కలుగగల ప్రాణాపాయము నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తమ ఆట్టి యంత్ర సామాగ్రి విషయములో ఎరిగి యుండియు గాని నిర్లక్ష్యముతోగాని, తీసికొనకుండెడు,

వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

కట్టడమును పడగొట్టు,లేక మరమ్మతుచేయు విషయమున నిర్లక్ష్యం ప్రవర్తన,

288. ఏదేని కట్టడమును పడగొట్టుటలో, లేక మరమ్మతు చేయుటలో ఆ కట్టడముగాని, దానిలో ఏదేని భాగముగాని పడిపోవుట వలన మనుష్యులకు బహుశ: కలుగగల ప్రాణాపాయము నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తను ఎరిగియుండియుగాని, నిర్లక్ష్యముతో గాని, ఆ కట్టడము విషయములో తీసికొనకుండెడు వారెవరైనను ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు,

జంతు వషయమున నిర్లక్ష్య ప్రవర్తన.

289. తన స్వాధీనమునందున్న ఏదేని జంతువు మూలముగా మనుష్యులకు బహుశః కలుగగల ప్రాణాపాయమును గాని, ఏదేని దారుణ ఘాతనుగాని నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తను ఎరిగియుండియు లేక నిర్లక్ష్యముతో, అట్టి జంతువు విషయములో తీసికొనకుండెడు వారెవరైనను, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అన్యథా నిబంధనలు లేని సందర్భములలో పబ్లికు న్యూ సెన్సు చేసినందుకు శిక్ష

290. శిక్షకై ఈ స్మృతిలో అన్యథా నిబంధనలు లేని ఏ సందర్భములో నై నను పబ్లికు న్యూ సెన్సు చేయు వారెవరైనను రెండు వందల రూపాయలదాక ఉండగల జూర్మానాతో శిక్షింపబడుదురు.

న్యూ సెన్సును కొన సాగించరాదని వ్యాదేశము ఇచ్చిన పిమ్మట దానిని కొనసాగించుట.


291. న్యూ సెన్సును మరల కలిగించరాదని, లేక కొనసాగించ రాదని వ్యాదేశమును శాసనసమ్మత ప్రాధికారము గల ఏ పబ్లికు సేవకుడై నను ఇచ్చిన మీదట, అట్టి న్యూ సెన్సును మరల కలిగించు, లేక కొనసాగించు వారెవరైనను ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాపముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.