పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్తీ ఓషదుల విక్రయము

275. ఏదేని ఓషధి యొక్క లేక ఔషధము యొక్క శక్తిని తక్కువ జేయునట్టి లేక దాని గుణమును మార్చు నట్టి లేక దానిని హానికరమగునదిగ చేయునట్టి రీతిగా కల్తీ చేయబడినదని ఎరిగియుండియు కర్తీ చేయబడని దానివలె దానిని విక్రయించు, లేక విక్రయింపజూపు లేక విక్రయమునకై పెట్టు, లేక ఔషధముగా ఏదేని ఔషధశాల నుండి దానిని ఇచ్చు, లేక కల్తీ దని తెలియని ఏ వ్యక్తి చేనైనను ఔషధముగా ఉపయోగింప చేయువారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఒక ఓషధిని వేరురకపు ఓషధిగా లేకఔషధముగా విక్రయించుట.

276. ఏదేని ఓషధిని వేరురకపు ఓషధిగా లేక ఏదేని ఔషధమును వేరు రకపు ఔషధముగా ఎరిగియుండియు విక్రయించు, లేక విక్రయింపజూపు, లేక విక్రయమునకై పెట్టు, లేక వైద్యము కొరకు ఏదేని ఔషధశాల నుండి ఇచ్చువారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానా తోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

సార్వజనిక ఊట లేక జలాశయము యొక్కనీటిని మురికిచేయుట.

277. ఏదేని సార్వజనికమైన ఊట, లేక జలాశయము యెుక్క నీరు సాధారణముగా వాడబడు ప్రయోజనమునకు అంతగా పనికిరాకుండా చేయుటకై స్వచ్ఛందముగా అపరిశుభ్రము చేయు, లేక మురికిచేయు వారెవరైనను, మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఐదు వందల రూపాయల దాక ఉండగల జుర్మానా తో గాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.

వాతావరణమును ఆరొగ్యమునకు హానికరమగునట్లు చేయుట. వా 278. ఏదేని స్థలములో, అచటికి దరిదాపుల నివసించు, లేక వ్యాపారము చేసికొను, లేక పబ్లికు మార్గమున నడచు, జన సామాన్యము యొక్క ఆరోగ్యమునకు హానికరమగునట్లు చేయుటకై అచటి వాతావరణమును స్వచ్ఛందముగా కలుషితము చేయు వారెవరైనను, ఐదు వందల రూపాయల దాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు.

పబ్లికు మార్గముపై దుడుకుగా వాహనమును నడుపుట లేక స్వారీచేయుట.

279. మనుష్యులకు ప్రాణాపాయము కలిగించాడు,లేక ఇతర వ్యక్తి కెవరికైనను ఘాతనుగాని, హానినిగాని కలిగించగల రీతిలో అత్యంత దుడుకుగా లేక నిర్లక్ష్యముతో ఏదేని పబ్లికు మార్గము పై ఏదేని వాహనమును నడుపు, లేక స్వారీచేయు వారెవరైనను ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాలోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

జలయానమును దుడుకుగా నడుపుట.

280. మనుష్యులకు ప్రాణాపాయము కలిగించెడు, లేక ఇతర వ్యక్తి కెవరికై నను ఘాతనుగాని హానిని గాని కలిగించగల రీతిలో దుడుకుగా లేక నిర్లక్ష్యముతో ఏదేని జలయానమును నడుపు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతొగాని, ఒక వేయి రూపాయలదాకు ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

తప్పుడు వెలుగును,గుర్తును లేక బోయ్ ని ప్రదర్శించుట.

281. ఏదేని తప్పుడు వెలుగును గుర్తును, లేక బోయ్ ని ప్రదర్శించుటవలన ఏ నావికునై నిను తప్పుదారి పట్టించ వలెనను ఉద్దేశముతో గానీ, తప్పుదారి పట్టించగలనని ఎరిగియుండి గాని, అట్లు ప్రదర్శించు వారెవరై నను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తో గాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు,

సురక్షితముగా లేనట్టి లేక మితిమీరిన బరువు ఎక్కింపబడినట్టి జలయానములో వ్యక్తిని కిరాయికి జలమార్గమున తీసికొనిపోవుట.

282. ఏదేని జలయానము: ఎవరేని వ్యక్తికి ప్రాణాపాయము కలిగించెడు స్ఠితిలోనైనను, మితిమీరిన బరువు ఎక్కింపబడినదిగానై నను ఉన్నపుడు, ఎరిగియుండియుగాని, నిర్లక్ష్యము వలన గాని ఆ వ్యక్తిని కిరాయికి ఆ జలయానములో జలమార్గమున తీసికొనిపోవు, లేక తీసికొనిపోబడునట్లు చేయు వారెవరైనను ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

పబ్లికు మార్గములో లేక నౌకాయాన పథములో అపాయము లేక ఆటంకము కలిగించుట.

283. ఏదేని కార్యమును చేయుట ద్వారా గాని, తన స్వాధీనములో నున్న, లేక తన వశమునందున్న ఏదేని ఆస్తి విషయములో సరియైన జాగ్రత్త తీసికొనకుండుట ద్వారాగాని, ఏదేని పబ్లికు మార్గములో లేక నౌకాయాన పథములో ఏ వ్యక్తి కైనను అపాయమును, ఆటంకమును లేక హానిని కలిగించు వారెవరైనను రెండు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు.

విషపదార్థము విషయమున నిర్లక్ష్య ప్రవర్తన.

284. ఏదేని విష పదార్థముతో మనుష్యులకు ప్రాణపాయము కలిగించెడు లేక ఏ వ్యక్తి కైనను ఘాతను గాని, హానిని గాని కలిగించగలరీతిలో దుడుకుగా, లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేసెడు, లేక, తన స్వాధీనములో ఉన్న ఏదేని విషపదార్థముతో మనుష్యులకు బహుశః కలుగగల ప్రాణాపాయము నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తను ఆట్టి విష పదార్థము విషయములో, ఎరిగియుండియుగాని, నిర్లక్ష్యముతోగాని, తీసికొనకుండెడు