పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నకిలీ నాణెములను చేయుటకై ఉపకరణములను తయారు చేయుట లేక విక్రయించుట.


233. నకిలీ నాణెములను చేయుటకు ఉపయోగింపబడు విమిత్త మై గాని అట్లు ఉపయోగించబడుటకు ఉద్దే శించబడినదని ఎరిగియుండియు, లేదా అట్లని విశ్వసించుటకు కారణముండియు గాని ఏదేని అచ్చుదిమ్మెనై నను ఉపకరణము నైనను తయారుచేయు, లేక మలుచు, లేక తయారు చేయునట్టి లేదా మలుచునట్టి ప్రక్రియలో ఏదేనిభాగమును నిర్వర్తించు లేక కొనుగోలుచేయు, లేక విక్రయించు లేక వ్యయనము చేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

నకిలీ భారతీయ నాణేములను చేయుటకై ఉపకరణమును చేయుట లేక విక్రయించుట,

234. నకిలీవగు భారతీయ నాణేములను చేయుటకు ఉపయోగింపబడు నిమిత్తమై గాని అట్లు ఉపయోగింప బడుటకు ఉద్దేశింపబడినదని ఎరిగియుండియు, లేక అట్లని విశ్వసించుటకు కారణముండియు గాని, ఏదేని అచ్చు దిమ్మెనై నను, ఉపకరణము నైనను తయారుచేయు, లేక మలుచు, లేక తయారుచేయు నట్టి లేక మలుచునట్టి ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు లేక కొనుగోలు చేయు, లేక విక్రయించు లేక వ్యయనము చేయు వారెవరై నన ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

నకిలీ నాణెములను చేయుటకు ఉపయోగించు నిమిత్తము ఉపకరణమును లేక సామాగ్రిని స్వాధీనము నందుంచు కొనుట.

235. నకిలీ నాణెములను చేయుటకు ఉపయోగింపబడు నిమిత్తమై గాని అట్లు ఉపయోగింపబడుటకుద్దేశింప బడినదని ఎరిగియుండియు లేక అట్లని విశ్వసించుటకు కారణముండియుగాని, ఏదేని ఉపకరణమును లేక సామాగ్రిని స్వాధీనము నందుంచుకొను వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

భారతీయ నాణెమైనచో:

మరియు, నకిలీ చేయబడెడు వాణెము భారతీయ నాణెమైనచో, పది సంవత్సరములదాక ఉండగల :కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

భారతదేశము వెలుపల నకిలీనాణెములను చేయుటకై భారతదేశములో దుష్ఫేరణము.


236. భారతదేశములో ఉండి, భారత దేశము వెలుపల నకిలీనాణెములను చేయుటకు దుష్ఫేరణము చేయు వారెవరైనను భారతదేశములో అట్టి నాణెములను చేయుటకై దుష్ఫేరణము చేసియుండిన ఎట్లొ అదే రీతిగా శిక్షింప బడుదురు.

నకిలీ నాణెముల దిగుమతి లేక ఎగుమతి

237. ఏదేని నకిలీ నాణెమును, నకిలీదని ఎరిగియుండియు, లేక ఆట్టి డని విశ్వసించుటకు కారణముండియు భారత దేశములోనికి దిగుమతిచేయు, లేక ఆచటినుండి ఎగుమతిచేయు వారెవరైనను, మూడు సంవత్సరములగాక ఉండగల కాలాధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు.

నకిలీ భారతీయ నాణెముల దిగుమతి లేక ఎగుమతి

238. నకిలీదగు భారతీయ నాణెమని తాను ఎరిగియున్నట్టి, లేక అట్టిదని తాను విశ్వసించుటకు కారణమున్నట్టి ఏదైనా నకిలీ నాణెమును భారతదేశము లోనికి దిగుమతిచేయు, లేక అచటి నుండి ఎగుమతి చేయు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

తన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీదని ఎరిగి యుండిన నాణేమును అందజేయుట.

239. . ఉన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీ నాణేమని తాను ఎరిగియున్నట్టి ఏదైనా నాణెమును వద్ద ఉంచుకొనియుండి, కపటముతో గాని కపటమునకు గురిచేయువలెనను ఉద్దేశముతోగాని, ఏ వ్యక్తి కై నను దానిని ఆందజేయు లేక ఏ వ్యక్తి నై నను దానిని పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, ఐదు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

తన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీదని ఎరిగియుండిన భారతీయ నాణెమును అందజేయుట.

240.తన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీ నాణేమని తాను ఎరిగియున్నట్టి ఏదైనా నకిలీ భారతీయ నాణెమును వద్ద ఉంచుకొనియుండి, కపటముతో గాని కపటమునకు గురిచేయవలెనను ఉద్దేశముతోగాని, ఏ వ్యక్తి కై నను దానిని అందజేయు, లేక ఏ వ్యక్తి నై నను దానిని పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరై నను పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసఘుతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.