పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశదీకరణము :-- ఈ ఉపపరిచ్ఛేదము నిమిత్తము ″గుర్తింపు పొందిన సంక్షేమ సంస్థ లేక వ్యవస్ఠ ″ అనగా కేంద్ర లేక రాజ్య ప్రభుత్వముచే ఈ విషయమున గుర్తించబడిన సాంఘిక సంక్షేమ సంస్థ లేక వ్యవస్థ అని అర్ఢము.

(3) ఉపపరిచ్ఛేదము (1)లో నిర్దేశింపబడిన ఆపరాధము విషయమున, న్యాయస్థాన సమక్షమున జరుగు ఏదేని చర్యకు సంబంధించిన విషయమును దేనినైనను ఆ న్యాయస్థానపు పూర్వానుజ్ఞ లేకుండనే ముద్రించు లేక ప్రచురించు వారెవరై నను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకవు కారావాసముతో శిక్షింప బడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము :-- ఏదేని ఉన్నత న్యాయస్థానము యొక్క లేక సర్వోన్నత న్యాయస్థానము యొక్క తీర్పును ముద్రించుట లేక ప్రచురించుట ఈ పరిచ్ఛేదపు భావములో అపరాధము కాదు.

జ్యూరరుగా లేక ఆ పెసరుగా ప్రతి రూపణము చేయుట.

229. ఏదేని సందర్భములో తాను జ్యూరరుగాగాని, అసెసరుగా గాని రిటర్నులో, లేక పానెలులో చేర్చబడుటకు లేక ప్రమాణము చేయింపబడుటకు తనకు శాసన ప్రకారము హక్కు లేదని తెలిసియుండి, ప్రతిరూపణము ద్వారాగాని, అన్యథాగాని, ఆ సందర్భములో తాను అట్లు రిటర్నులో లేక పానెలులో చేర్చబడునట్లు, లేక ప్రమాణము చేయింప బడునట్లు ఉద్దేశపూర్వకముగా చేయించు, లేక తెలిసియుండియు అట్లు చేయించుకొను, లేక శాసన విరుద్ధముగా తాను ఆట్లు రిటర్నులో లేక పొనెలులో చేర్చబడినట్లు, లేక ప్రమాణము చేయింపబడినట్లు తెలిసి యుండియు అట్టి జ్యూరరుగా గాని, అట్టి అసెసరుగా గాని స్వచ్ఛందముగా సేవ చేయువారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అధ్యాయము -12

నాణెములకు, ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన అపరాధములను గురించి

"నాణెము "నకు నిర్వచనము.

230. నాణెము అనగా డబ్బగా చెలామణి అగుటకు గాను ఏదేని ఒక రాజ్య ప్రాధికారము లేక సార్వభౌమాధి కారము క్రింద ముద్రవేయబడి, జారీచేయబడి, తత్సమయమున డబ్బుగా చెలామణియగుచున్న లోహము.

భారతీయ నాణెము.

భారతీయ నాణేము అనగా డబ్బుగా చెలామణి అగుటకుగాను భారత ప్రభుత్వ ప్రాధికారము ద్వారా ముద్ర వేయబడి, జారీచేయబడిన లోహము, మరియు అట్లు ముద్ర వేయబడి, జారీ చేయబడినట్టి లోహము డబ్బుగా చెలామణిలో లేకుండా పోయినప్పటికిని ఈ అధ్యాయము నిమిత్తము భారతీయ నాణెముగ కొనసాగు చుండును.

(ఎ) కౌరీలు నాణెములు కావు: (బి) ముద్ర వేయబడని రాగి తునకలు డబ్బుగా చెలామణియై నను వాములు కావు : (సీ) పతకములు డబ్బుగా చెలామణియగుటకు ఉద్దేశింపబడినవి కానందున నాణెములు కావు : (డీ) కం పెనీవారి రూపాలు అని అనబడు నాణెము భారతీయ వాణేము. (ఈ) భారత ప్రభుత్వ ప్రాధికారము క్రింద పూర్వము డబ్బుగా చెలామణియై నట్టి “ఫరుఖాబాదు" రూపాయి.. ఇప్పుడు అట్లు చెలామణిలో లేకపోయినను, భారతీయ నాణెముగా నుండును.

నకిలీ నాణెములను చేయుట.

231. నకిలీ నాణెములను చేయువారు ఎవరైనను తెలిసియుండియు నకీలీ నాణెములను చేయు ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు వారెవరై నను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి, రెంటిలో ఒక రకపు కారావాసము తో శిక్షింప బడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము :-- మోసగించు ఉద్దేశముతో లేక తద్వారా మోసగింపబడుట జరుగగలదని తెలిసియుండియు అసలైన నాణెములు వేరు రకపు నాణెముగా కనిపించునట్లు చేయు వ్యక్తి ఈ అపరాధ రుసు చేసినవాడగును.

నకిలీదగు భారతీయ నాణెములను చేయుట

232. నకిలీ దగు భారతీయ నాణెమును చేయువారెవరైనను, లేక తెలిసియుండియు అట్టి నాణెములను చేయు: ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు, మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు.