పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3


బీ) దోషారోపణ విషయమున అధికారితను వినియోగించి, ఆపీలు ఉన్నను లేకున్నను, జుర్మానా లేక కారావాస శిక్ష విధించుటకు ఆధికారముగల మేజిస్టేటు ఒక న్యాయాదీశుడు.

(సీ) దావాలను విచారణ చేసి నిర్ధారణ చేయుటకు మదరాసు కోడునందలి 1816 లోని 7వ నియమము క్రింద అధికారముగల పంచాయతీ సభ్యుడు. ఒక న్యాయాధీశుడు.

డి) మరొక న్యాయస్థానమునకు విచారణకై పంపుటకు మాత్రమే తనకు అధికారముగల దోషారోపణ విషయమున అధికారితను వినియోగించుచున్న మేజిస్టేటు న్యాయాధీశుడు కాడు.

“న్యాయస్థానము"

20. “న్యాయస్థానము" అను పదము న్యాయికముగా తానొక్కడుగనే వ్యవహరించుటకు శాసనము ద్వారా అధికారము పొందినవాడై అట్లు వ్యవహరించుచున్నట్టి న్యాయాధీశునిగాని, న్యాయికముగా న్యాయాదీశ నికాయముగా వ్యవహరించుటకు శాసనము ద్వారా అధికారము పొందినదై అట్లు వ్యవహరించుచున్నట్టి న్యాయాదీశనికాయమునుగాని తెలుపును.

ఉదాహరణము

దావాలను విచారణ చేసి నిర్ధారణ చేయుటకు మద్రాసు కోడునందలి 1816 లోని 7వ నియమము క్రింద అధికారము కలిగి వ్యవహరించు పంచాయత్ ఒక న్యాయస్థానము.

“పబ్లికు సేవకుడు"

21. “పబ్లికు సేవకుడు" అను పదములు దిగువ వివరింపబడిన వారిలో ఏ వ్యక్తినైనను తెలుపును, అనగా :--

మొదటిది:- ... ... ... ...

రెండవది :- భారత సైనిక, నౌకా, లేక వైమానిక బలములోని ప్రతి కమీషన్డ్ అధికారి;

మూడవది :-- తాను ఒక్కడుగనేగాని ఏదేని వ్యక్తుల వికాయపు సభ్యుడుగా గాని ఏదేని న్యాయనిర్ణయ విధులను నిర్వహించుటకు శాసనము క్రింద అధికారము పొందిన ఎవరేని వ్యక్తితో సహా, ప్రతి న్యాయాధీశుడు ;

నాల్గవది :-- (లిక్విడేటరు, రిసీవరు లేక కమిషనరుతో సహా) ఏదేని శాసనవిషయమును లేక సంగతిని గూర్చిన దర్యాప్తు చేయుట లేక రిపోర్టు చేయుటగాని, ఏదేని దస్తావేజును రూపొందించుట, అధి ప్రమాణికరించుట లేక భద్ర పరచుట గాని, ఏదేని ఆస్తిని స్వాదీనపరచుకొనుట లేక వ్యయనము చేయుటగాని, ఏదేని న్యాయిక ఆదేశికను అమలు పరుచుటగాని, ఏదేని ప్రమాణమును చేయించుటగాని, దుబాసీగా వ్యవహరించుటగాని, న్యాయస్థానమునందు గలభా జరుగకుండా చూచుట గాని, అధికారిగా తన కర్తవ్యమై యున్నట్టి ప్రతి న్యాయస్థానాధికారి, మరియు ఆట్టి కర్తవ్యము లలో దేనినైనను నిర్వర్తించుటకు న్యాయస్థానముచే ప్రత్యేకముగా ప్రాధికారమీయబడిన ప్రతి వ్యక్తి ;

అయిదవది : -ఏదేని న్యాయస్థానమునకు లేక పబ్లికు సేవకునికి సహాయపడు ప్రతి జ్యూరీ సభ్యుడు, ఆఫీసర, లేక పంచాయతీ సభ్యుడు;

ఆరవది :-ఏదేని వ్యాజ్యమును లేక విషయముమ గురించి నిర్ణయము చేయవలసినదిగా లేక నివేదికను సమ ర్పించవలసినదిగా ఏదేని న్యాయస్థానముచే లేక ఎవరేని ఇతర సమర్థ పబ్లికు ప్రాధికారముచే నిర్దేశింపబడిన ప్రతి మధ్యవర్తి లేక ఇతర వ్యక్తి;

ఏడవది :- ఏ వ్యక్తి నైనను పరిరోధములో పెట్టుటకు లేక పరిరోధమునందే ఉంచుటకు ఏదేవి పదవినిబటి అధికారము పొంది ఆ పదవియందున్న ప్రతి వ్యక్తి;

ఎనిమిదవది : అపరాధములను విచారించుట, అపరాధములను గూర్చి సమాచారమిచ్చుట, అపరాధులను విచారణకు తెచ్చుట, లేక ప్రజల ఆరోగ్యమునుగాని భద్రతనుగాని సౌకర్యమునుగాని కాపాడుట తన ఆధికారిక కర్తవ్యమై యున్నట్టి ప్రతి ప్రభుత్వాధికారి;

తొమ్మిదవది :- ప్రభుత్వము తరఫున ఏదేని ఆస్తిని తీసికొనుట, అందుకొనుట, భద్రపరచుట, లేక ఖర్చు చేయుటగాని, ప్రభుత్వము తరఫున ఏదేని సర్వేను, పన్ను నిర్ధారణను లేక కాంట్రాక్టును చేయుట గాని, లేక ప్రభుత్వపు ధనసంబంధ హితములపై ప్రభావము ఉండెడు ఏదేని విషయములో ఏదేని రెవిన్యూ ఆదేశికమును అమలు పరచుట, లేక ఏదేని దర్యాప్తు జరుపుట లేక ఏదేని రిపోర్టు చేయుటగాని, ప్రభుత్వ ధన సంబంధ హితములకు సంబంధించిన ఏదేని దస్తావేజును రూపొందించుట లేక అధి ప్రమాణీకరించుట లేక భద్రపరచుట గావి, ప్రభుత్వ ధన సంబంధ హితములను కాపాడుటకై ఏదేని శాసన ఉల్లంఘనను విచారించుటగాని తన ఆధికారిక కర్తవ్యమై యున్నట్టి ప్రతి అధికారి;