పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4


పదవది : -ఏదేని ఆస్తిని తీసికొనుట, అందుకొనుట, భద్రపరచుట లేక ఖర్చు చేయుటగాని, ఏదేని సర్వేను, పన్ను నిర్ధారణను చేయుట గాని, ఏదేని గ్రామము, పట్టణము లేక జిల్లా యొక్క ఏదేని లౌకిక, సాముదాయిక ప్రయోజనమునకై ఏదేని రేటునైనను పన్నునైనను విధించుట గాని, ఏదేని గ్రామ, పట్టణ, లేక జిల్లా ప్రజల హక్కులను నిశ్చయించుటకై ఏదేని దస్తావేజును రూపొందించుట, అధి ప్రమాణీకరించుట లేక భద్రపరచుట గాని, తన ఆధికారిక కర్తవ్యమై యున్నట్టి ప్రతి అధికారి;

పదకొండవది: - ఎన్నికల జాబితాను తయారు చేయుటకు, ప్రచురించుటకు, నిర్వహించుటకు లేక సవరించుటకుగాని, ఎన్నికను లేక ఎన్నికలో ఒక భాగమును జరిపించుటకుగాని ఏదేని పదవినిబట్టి అధికారమును పొంది అట్టి పదవియం దున్న ప్రతి వ్యక్తిని;

పండ్రెండవది :- (ఏ) ప్రభుత్వ సేవ చేయుచున్నట్టి లేక వేతనము పొందుచున్నట్టి, లేక ఏదేని పబ్లికు కర్తవ్య నిర్వర్తనకై ప్రభుత్వమునుండి ఫీజుగ లేదా కమీషనుగ ప్రతిమూల్యమును పొందుచున్నట్టి ప్రతి వ్యక్తి;

(బి) కేంద్ర, ప్రొవిన్షయల్, లేక రాజ్య చట్టము ద్వారా అయినను, అట్టి చట్టమును బట్టి అయినను ఏర్పాటు చేయబడిన ఒక స్థానిక ప్రాధికారములో లేక కార్పొరేషనులో లేక కంపెనీల చట్టము, 1956 (1956లోని 1వ చట్టము) యొక్క 617వ పరిచ్ఛేదములోని నిర్వచనము వర్తించు ప్రభుత్వ కంపెనీలో, సేవ చేయుచున్న లేక వేతనము పొందుచున్న ప్రతి వ్యక్తి .

ఉదాహరణము

పురపాలక కమీషనరు. ఒక పబ్లికు సేవకుడు.

విశదీకరణము 1 :- ప్రభుత్వముచే నియమింపబడినవారైనను కాకున్నను, పైన వివరింపబడినవారిలో ఏ వ్యక్తు లైనను పబ్లికు సేవకులగుదురు.

విశదీకరణము 2 :- "పబ్లికు సేవకుడు" అను పదములను అవి ఎచట వచ్చినను, ఒక పబ్లికు సేవక ఉద్యోగ స్థానము నందు ఉండుటకు తనకు గల హక్కులో శాసనపరమైన ఎటువంటి దోషము ఉన్నను, వాస్తవముగా అట్టి స్థానము నందున్న ప్రతి వ్యక్తి యు, అని అర్థము చేసికొనవలెను.

విశదీకరణము 3 :- “ఎన్నిక" అను పదము ఏదేని శాసననిర్మాణ, పురపాలక, లేక ఏ తీరుదైనను ఇతర పబ్లికు ప్రాధికారమునకు సభ్యులను ఎంపిక చేయు పదతిని ఎన్నిక అని శాసనముచే లేక శాసనము క్రింద విహితము చేసినపుడు ఆ సభ్యుల ఎంపికనిమిత్తమైన ఎన్నికను తెలుపును.

విశదీకరణము 4: ... ... ... ...

“చరాస్తి "

22. “చరాస్తి " అను పద పరిధిలో భూమియు, భూ బద్ధమై యున్న లేక భూ బద్దమై యున్నదానికి శాశ్వతముగ బిగించబడియున్న వస్తువులు మినహా, ప్రతి రకపు భౌతికమైన ఆస్తి చేరియుండును.

ఆక్రమ లాభము "

23. “అక్రమ లాభము" అనగా లాభము పొందు వ్యక్తి తనకు శాసనరీత్యా హక్కు లేనట్టి ఆస్తిని శాసన సమ్మతముకాని పద్ధతులవలన పొందగా అతనికి గలిగిన లాభము.

"అక్రమ నష్టము "

“అక్రమ నష్టము” అనగా నష్టపడు వ్యక్తి తనకు శాసనరీత్యా హక్కు ఉన్నట్టి ఆస్తిని శాసన సమ్మతముకాని పద్ధతులవలన పోగొట్టుకొనగా అతనికి కలిగిన నష్టము.

అక్రమముగా లాభము పొందుట.

ఒక వ్యక్తి అక్రమముగా ఆర్జించునపుడే గాక, అక్రమముగా తనవద్ద అట్టే పెట్టుకొనునప్పుడు గూడ అక్రమముగా లాభము పొందునట్లు చెప్పబడును.

అక్రమముగా నష్ట పడుట.

ఏదేని ఆస్తిని ఒక వ్యక్తికి దక్కనీయకుండా అక్రమముగా చేసినపుడును, ఏదేని ఆస్తిని అతని వశములో ఉండనీయ కుండా అక్రమముగా చేసినపుడును, అట్టి వ్యక్తి అక్రమముగా నష్ట పడినట్లు చెప్పబడును.

" నిజాయితీలేకుండ"

24. ఒక వ్యక్తికి అక్రమ లాభమునుగాని మరొక వ్యక్తికి అక్రమ నష్టమునుగాని కలిగించు ఉద్దేశ్యముతో ఏ పనినైనను చేయు వారెవరైనను ఆ పనిని “నిజాయతీ లేకుండా” చేసినట్లు చెప్పబడుదురు.