పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29


సైనికుడు, నావికుడు లేక వైమానికుడు ఉపయోగించెడి దుస్తులను ధరించుట, లేక టోకెను పెట్టుకొనుట.

140. భారత ప్రభుత్వ సైనిక, నౌకా లేక వైమానిక సేవలోని సైనికుడు, నావికుడు లేక వైమానికుడు కానప్పటికి, తాను అట్టి సైనికుడు, నావికుడు లేక వైమానికుడు అని విశ్వసింప జేయవలెనను ఉద్దేశముతో అట్టి సైనికుడు, నావికుడు లేక వైమానికుడు ఉపయోగించెడి ఏవేని దుస్తులను పోలియున్న లేక ఏదేని టోకెనుసు పోలియున్న ఏవేని దుస్తులను ధరించు, లేక ఏదేని టోకెను పెట్టుకొను వారెవరైనను, మూడు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని అయిదు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అధ్యాయము-8

ప్రజా ప్రశాంతికి భంగకరమగు అపరాధములను గురించి.

శాసన విరుద్ధ సమావేశము.

141. అయిదుగురు లేక అంతకు ఎక్కువమంది వ్యక్తుల సమావేశము, ఆ సమావేశములోని వ్యక్తుల ఉమ్మడి లక్ష్యము ఈ క్రింద పేర్కొనిన వాటిలో ఏదైనచో, "శాసన విరుద్ధ సమావేశము " అనబడును,

మొదటిది :-- కేంద్ర ప్రభుత్వమును 'లేక ఏదేని రాజ్య ప్రభుత్వమును లేక పార్లమెంటును, లేక ఏదేని రాజ్య శాసనమండలిని, లేక పబ్లికు సేవకుడుగ తన శాసన సమ్మత అధికారమును వినియోగించుచున్న ఎవరేని పబ్లికు సేవకుని, ఆపరాధిక బల ప్రయోగము ద్వారా లేక ఆపరాధిక బల ప్రదర్శనము ద్వారా హడలగొట్టుట, లేక

రెండవది :— ఏదేని శాసనమును లేక శాసనిక అదేశికను అమలు పరుచుటను ప్రతిఘటించుట; లేక

మూడవది :- ఏదేని దుశ్హ్చేష్టను లేక ఆపరాధిక ఆక్రమ ప్రవేశమును, లేక ఇతర అపరాధమును చేయుట, లేక

నాల్గవది :-- ఏ వ్యక్తి పట్ల నైనను ఆపరాధిక బలమును ప్రయోగించుట ద్వారానై నను ఆపరాధిక బలమును ప్రదర్శించుట ద్వారానై నను ఏదేని ఆస్తిని స్వాధీనము చేసికొనుట, లేక ఆస్తి స్వాధీనము పొంచుట, లేక ఏ వ్యక్తికై నను ఆతడు స్వాధీనము కలిగియున్న లేక ఆనుభవించుచున్న ఒక దారి హక్కు గాని, నీటిని ఉపయోగించుకొను హక్కుగాని ఇతర నిరాకారమైన హక్కు. గాని దక్కకుండా చేయుట, లేక ఏదేని హక్కును గాని, కలదనుకొను ఏదేని హక్కునుగాని అమలుపరచుట, లేక

అయిదవది:- అపరాధిక బలప్రయోగము ద్వారా లేక ఆపరాధిక బల ప్రదర్శనము ద్వారా ఏ వ్యక్తినైనను అతడు చేయుటకు శాసన బద్దుడుగాని దేనినైనను చేయుమని గాని, అతడు చేయుటకు శాసన రీత్యా హక్కు కలిగియున్నట్టి దేనినైనను చేయకుండుమని గాని బలవంతము చేయుట.

విశదీకరణము :- సమావేశమైనపుడు, ఆ సమావేశము శాసన నిరుద్ధమైనట్టిది కాకున్నను, ఆ తరువాత అది శాసన విరుద్ద సమావేశము కావచ్చును.

శాసవ విరుద్ధ సమావేశమునకు చెందిన వ్యక్తి.

142. ఏ సమావేశమునైనను శాసనవిరుద్ద సమావేశముగ నొనర్చెడు సంగతులను ఎరిగియుండియు, ఉద్దేశ పూర్వకముగా ఆ సమావేశములో చేరు లేక దానిని వీడకయుండు నతడెవరైనను శాసన విరుద్ధ సమావేశమునకు చెందిన వ్యక్తి అని చెప్పబడును.

శిక్ష.

143. శాసనవిరుద్ధ సమావేశమునకు చెందిన వారెవరైనను, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

మారణాయుధమును ధరించి శాసనవిరుద్ధ సమావేశములో చేరుట.

144. ఏదేని మారణాయుధమును ధరించి గాని, దాడి ఆయుధముగా ఉపయోగించినపుడు మరణము కలిగించజాలు దేనినైనను ధరించిగాని శాసన విరుద్ధ సమావేశమునకు చెందియుండు వారెవరైనను రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింప బడుదురు.

చెదరిపోవలసినదని ఆజ్ఞాపింపబడినట్లు ఎరిగియుండియు,శాసనవిరుద్ధ సమావేశములో చేరుట, లేక దానిని వీడకుండుట.


145. ఏదేని శాసన నిరుద్ధ సమావేశమును చెదరిపోవలసినదని శాసన విహిత అతిగా ఆజ్ఞా సంపనట్లు ఎరిగి యుండియు, అట్టి శాసన విరుద్ధ సమావేశములో చేరు లేక దానిని వీడకుండు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.