పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28


తిరుగుబాటుకు దుష్ప్రేరణచేయుట, తత్పరిణామముగా తిరుగుబాటు చేయబడినచో,

132. భారత ప్రభుత్వ సైన్యములోని, నౌకా బలము లేక వైమానిక బలములోని అధికారిని, సైనికుని నావికుని లేక వైమానికుని తిరుగుబాటు చేయుటకు దుష్ప్రేరణ చేయు వారెవరైనను, ఆ దుష్ప్రేరణ పరిణామముగా తిరుగుబాటు చేయబడినచో, మరణ దండనతోగాని, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

పదవి నిర్వహించు చున్నట్టి పై అధికారి పట్ల దౌరవ్యమునకు సైనికుని, నావికుని లేక వైమానికుని దుష్ప్రేరణ చేయుట.

133. తన పదనిని నిర్వహించుచున్నట్టి ఎవరేని పై అధికారిపట్ల దౌర్జన్యము చేయుటకు భారత ప్రభుత్వ సైన్యములోని నౌకా బలము లేక వైమానిక బలములోని ఒక అధికారిని, "సైనికుని, నావికుని లేక వైమానికుని దుష్ప్రేరణ చేయు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకవు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

అట్టి దౌర్జన్యమునకు దుష్ప్రేరణ, దౌర్జన్యము చేయబడినచో,

134. తన పదవిని నిర్వహించుచున్నట్టి ఎవరేని పై అధికారిపట్ల దౌర్జన్యము చేయబడుటకు భారత ప్రభుత్వ సైన్యములోని, నౌకా బలము లేక వైమానిక బలములోని ఒక అధికారిని, సైనికుని, నావికుని లేక వైమానికుని దుష్ప్రేరణ చేయు వారెవరైనను, ఆ దుష్ప్రేరణ పరిణామముగా అట్టి దౌర్జన్యము చేయబడినచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసములో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

సైనికుని, నావికుని లేక వైమానికుని తన సేవను విడిచి పారిపోవుటకు దుష్ప్రేరణ చేయుట.

135. భారత ప్రభుత్వ సైన్యములోని, నౌకాబలము, లేక వైమానిక బలములోని అధికారిని, సైనికుని, నావికుని లేక వైమానికుని తన సేవను విడిచి పారిపోవుటకు దుష్ప్రేరణ చేయు వారెనరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

సేనను విడిచి పారిపోయిన వ్యక్తికి ఆశ్రయము నిచ్చుట.

136. భారత ప్రభుత్వ సైన్యము, నౌకాబలము లేక వైమానిక బలములోని అధికారి, సైనికుడు,నావికుడు లేక వైమానికుడు సేవను విడిచి పారిపోయినాడని ఎరిగియుండియు, లేక ఆట్లు విశ్వసించుటకు కారణము ఉండియు, అట్టి అధికారికి, సైనికునికి, నావికునికి లేక వైమానికునికి, ఇందు ఇటు పిమ్మట మినహాయింప బడినట్లు తప్ప, ఆశ్రయమిచ్చు వారెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

మినహాయింపు : భార్య భర్తకు ఆశ్రయము ఇచ్చిన సందర్భమునకు ఈ నిబంధన విస్తరించదు.

సేనను విడిచి పారిపోయిన వ్యక్తి వాణిజ్య జలయానముపై దాని మాస్టరు నిర్లక్ష్యము వలన దాచబడి యుండుట.

137. భారత ప్రభుత్వ సైన్యమును, నౌకాబలమును, లేక వైమానిక బలమును విడిచి పారిపోయిన ఎనలేని వ్యక్తి దాచబడియున్నట్టి ఒక వాణిజ్య జలయానము యొక్క మాస్టరు లేక ఆ జలయానము బాధ్యతగల వ్యక్తి అట్లు దాచబడి యుండుట తాను ఎరుగకున్నప్పటికీని, మాస్టరుగా లేక అట్టి బాధ్యతగల వ్యక్తిగా తన కర్తవ్యమును నిర్లక్ష్యము చేసియుండని యెడల, లేక ఆ జలయానము పై క్రమశిక్షణ కొరవడియుండని యెడల, ఆట్లు దాచబడియున్నట్లు తాను ఎరిగి యుండెడి వాడగుచో, ఐదు వందల రూపాయలకు మించని శాస్త్రికి పాత్రుడగును.

సైనికుని, నావికుని,లేక వైమానికుని ఆ విధేయతతో కూడిన కార్యము చేయుటకు దుష్ప్రేరణ చేయుట.

138. భారత ప్రభుత్వ సైన్యము, నౌకా బలము లేక వైమానిక బలములోని అధికారి, సైనికుడు, నావికుడు లేక వైమానికుడు చేయు కార్యము అవిధేయతతో కూడిన కార్యమగునవి తాను ఎరిగియుండియు ఆ కార్యమును దుష్ప్రేరణ చేయు వారెవరైనను, ఆ దుష్ప్రేరణ పరిణామముగా అట్టి అవిధేయతతో కూడిన కార్యము చేయబడినచో, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

138-ఏ X X X

కొన్ని చట్టములకు లోనై యుండు వ్యక్తుల విషయము 1950లోని 46వ చట్టము. 1934లోని 34వ చట్టము,1950లో 45వ చట్టము

139. ఆర్మీ చట్టమునకు, సేవా చట్టము, 1950నకు, నేవల్ డిసిప్లన్ చట్టమునకు, ఇండియన్ నేవీ( డిసిప్లిన్ ) చట్టము 1934 నకు, ఎయిర్ ఫోర్స్ చట్టమునకు, లేక వైమానిక జల చట్టము, 1950 నకు లోబడియున్న ఏ వ్యక్తియు ఈ అధ్యాయములో నిర్వచింపబడిన ఆపరాధములలో దేనికి గాని ఈ స్మృతి క్రింద శిక్షకు లోనై ఉండడు.