పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11


ఆరు సంవత్సరముల లోపల గాని, కారావాసములో ఉన్నపుడుగాని, జుర్మానాను వసూలు చేయవచ్చును. మరణము వలన ఆస్తి బాధ్యతవిముక్తముకాదు.

70. జుర్మానాను గాని, దానిలో చెల్లింపక మిగిలియున్న ఏదేని భాగమునుగాని, దండనోత్తరువు ఈయబడిన పిమ్మట ఆరు సంవత్సరముల లోపల ఎప్పుడైనను, మరియు దండనోత్తరువు క్రింద అపరాధి ఆరు సంవత్సరముల కంటె హెచ్చు కాలావధికి కారావాసమునకు పాత్రుడై యున్నచో, అప్పుడు ఆ కాలావధి పూర్తి అగుటకు పూర్వము ఎప్పుడైనను వసూలు చేయవచ్చును, మరియు అపరాధి మరణము వలన అతని మరణానంతరము అతని ఋణములను చెల్లించవలసిన బాధ్యతకు శాసనరీత్యా లోనై యున్న ఆస్తికి అట్టి బాధ్యత విముక్తముకాదు.

అనేక అపరాధములతో కూడుకొనియున్న ఆపరాధమునకు శిక్షా పరిమితి.

71. ఏదేని అపరాధము కొన్ని భాగములతో కూడుకొనియుండి, అందలి ఏ భాగమైనను దానికదే ఒక అపరాధ మగునెడల, అపరాధిని అట్టి అతని అపరాధములలో ఒక దానికి గల శిక్ష కంటే ఎక్కువ శిక్షతో దండించ వచ్చునని అభివ్యక్తముగా నిబంధన ఉన్ననే తప్ప, అట్లు దండించరాదు.

ఏ పని యైనను తత్సమయమున అములు నందుండి అపరాధములను నిర్వచించునట్టి లేక శిక్షించునట్టి ఏదేని శాసనములోని రెండు లేక అంతకు మించిన వేరువేరు నిర్వచనముల క్రిందికి వచ్చు ఆపరాధమగు నెడల, లేక

అనేక కార్యములలోని ఒక కార్యము దానికదే లేక ఒకటి కంటే ఎక్కువ కార్యములు వాటికవే ఒక అపరాధము అగుచు, అన్నియు చేరి ఒక విభిన్న అపరాధమగునెడల,

అపరాధిని విచారణ చేయు న్యాయస్థానము అట్టి అపరాధములలో ఏ ఒక దానికై నను విధించగల శిక్ష కంటె తీవ్రతరమైన శిక్షతో అతనిని దండించరాదు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' ఒక కర్రతో 'జడ్'ను ఏబది దెబ్బలు కొట్టును. ఇచట 'ఏ' ఆ మొత్తము దెబ్బల వల్లమ, ఆ మొత్తము దెబ్బలలోని ఒక్కొక్క దెబ్బవల్లను కూడ స్వచ్ఛందముగా 'జడ్'కు ఘాత కలిగించుట అను అపరాధమును చేసియుండ వచ్చును. ప్రతి దెబ్బకు 'ఏ' శిక్షా పాత్రుడగుచో అతనిని ఒక్కొక్క దెబ్బకు సంవత్సరము చొప్పున ఏబది సంవత్సరముల పాటు కారావాసమునందు ఉంచవచ్చును. కాని అతడు ఆ మొత్తము దెబ్బలకై ఒక శిక్షకు మాత్రమే పాత్రుడగును.

(బి) కాని, 'జడ్'ను 'ఏ' కొట్టుచుండగా 'వై' జోక్యము కలిగించుకొనును.'ఏ' ఉద్దేశ పూర్వకముగా 'వై'ని కొట్టినచో, ఇచట 'వై'ని కొట్టిన దెబ్బ, 'ఏ' స్వచ్ఛందముగా 'జడ్'కు ఘాత కలిగించు కార్యములో భాగము కాదు. కాబట్టి 'జడ్'కు స్వచ్ఛందముగా ఘాత కలిగించినందుకు ఒక శిక్షకును, 'వై'ని కొట్టిన దెబ్బకు మరొక శిక్టకును 'ఏ' పాత్రుడగును.

ఒక వ్యక్తి అనేక ఆపరాధములలో ఒకటి చేసినవాడై దేనిని అతడు చేసెనో సందేహాస్పదమని తీర్పులో చెప్పబడినపుడు ఆ వ్యక్తి కి శిక్ష.

72. తీర్పులో నిర్దిష్టమైన అనేక అపరాధములలో ఒక దానిని ఒక వ్యక్తి చేసెననియు, కాని ఆ అపరాధములలో దేనిని అతడు చేసినదీ సందేహాస్పదమనియు, తీర్పు ఈయబడిన అన్ని కేసులలోను, నిబంధనలను బట్టి ఆ అపరాధము అన్నిటికీ ఒకే తరహా శిక్ష లేనిచో, దేనికి నిబంధనలను బట్టి అన్నిటికంటే తక్కువ శిక్ష గలదో, ఆ ఆపరాధమునకు అపరాధిని దండించవలెను.

ఏకాంతపు చెఱ.

73. ఈ స్మృతి క్రింద కఠిన కారావాస దండనోత్తరువు విచ్చుటకు న్యాయస్థానము అధికారము కలిగియున్నట్టి అపరాధము చేసిన ఏ వ్యక్తియైనను దోషస్థాపితుడై నపుడెల్లను, అపరాధికి దండనగ విధింపబడిన కారావాస శిక్షలో ఏదేని భాగమును లేక ఏవేని భాగములను, మొత్తముమీద మూడు మాసములకు మించకుండ, అపరాధి ఏకాంతపు చెఱయందు గడపవలెనని ఈ క్రింద పేర్కొనబడిన కాల ప్రమాణము ప్రకారము న్యాయస్థానము తమ దండనోత్తరువు ద్వారా ఉత్తరువు ఈయవచ్చును; అనగా———

కారావాస కాలావధి ఆరు మాసములకు మించనిచో, ఒక మాసమునకు మించని కాలము,

కారావాస కాలావధి ఆరు మాసములకు మించి, ఒక సంవత్సరమునకు మించనిచో, రెండు మాసములకు మించని కాలము,

కారావాస కాలావధి ఒక సంవత్సరమునకు మించినచో, మూడు మాసములకు మించని కాలము.

ఏకాంతపు చెఱ యొక్క కాలపరిమితి.

74. ఏకాంతపు చెఱను విధించిన దండనోత్తరువును అమలు పరచుటలో, ఏ సందర్భములోనైనను అట్టి చెఱ తడవకు పదునాలుగు దినములకు మించకూడదు, మరియు ఏకాంతపు చెఱ కాలావధుల మధ్య అట్టి కాలావధులకు తక్కువకాని విరామములు ఉండవలెను, మరియు విధింపబడిన కారావాసము మూడు మాసములకు మించినపుడు, విధింప