పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10


61. X X X X X X

62 X X X X X X

జుర్మానా మొత్తము.

63. ఎంత మొత్తము మేరకు జర్మానా వేయవచ్చునో తెలుపబడని యెడల, ఆపరాధికి విధించదగు జుర్మానా మొత్తమునకు పరిమితి లేదు; కాని జుర్మానా అత్యధికమై యుండరాదు.

జర్మానా చెల్లించనందుకు కారావాస దండన.

64. కారావాసముతోపాటు జుర్మానాతో కూడ శిక్షింపదగు అపరాధమునకు, కారావాసముతోగాని కారావాసము లేకుండగాని, అపరాధిని జుర్మానాతో దండించు ప్రతి కేసులోను,

మరియు, కారావాసముతోనైనను జుర్మానాతో అయినను, లేక జుర్మానాతో మాత్రమే అయినను శిక్షింపదగు అపరాధము నకు అపరాధిని జుర్మానాతో దండించు ప్రతి కేసులోను,

జుర్మానా చెల్లించని పక్షమున, అపరాధి ఒక నిశ్చిత కాలావధికి కారావాసమును అనుభవించవలెనని దండనోత్తరువు ద్వారా ఆదేశించుటకు అట్టి అపరాధిని దండించు న్యాయస్థానము సమర్థమైనదై ఉండును, ఈ కారావాసము, అతనికి ఈయబడిన దండనోత్తరువు క్రింద లేక దండన లఘాకరణమునుబట్టి అతడు పాత్రుడగు ఏదేని ఇతర కారావాసమునకు అదనముగ ఉండును.

కారావాసము మరియు జుర్మానా విధింపదగినపుడు, జుర్మానా చెల్లించనందుకు కారావాస పరిమితి.

65. కారావాసముతోపాటు జుర్మానాతో కూడ శిక్షింపదగినదైన అపరాధమైనచో, జూర్మానా చెల్లించని పక్షమున ఆ అపరాధికి న్యాయస్థానము ఆదేశించునట్టి కారావాస కాలావధి, ఆ ఆపరాధమునకు నియతమైన గరిష్ట కారావాస కాలావధిలో నాలుగవ వంతుకు మించరాదు.

జుర్మానా చెల్లించనందుకు ఏరకపు కారావాసము విధించవచ్చును.

66. జుర్మానా చెల్లించని పక్షమున న్యాయస్థానము విధించునట్టి కారావాసము, ఆ ఆపరాధమును గురించి అపరాధికి దండనగా ఈయదగు ఏ రకపు కారావాసమైనను కావచ్చును.

అపరాధము జుర్మానాతో మాత్రమే శిక్షింపదగిన దైనపుడు, జుర్మానా చెల్లించనందుకు కారావాసము,

67. జుర్మానాతో మాత్రమే శిక్షింపదగినదైన అపరాధమైనచో, జూర్మానా చెల్లించని పక్షమున న్యాయస్థానము విధించునట్టి కారావాసము సాధారణమైనదై ఉండవలెను, మరియు జుర్మానా చెల్లించని పక్షమున అపరాధిని కారావాసములో వుంచవలసినదిగా న్యాయస్థానము ఆదేశించు కారావాస కాలావధి ఈ క్రింది కాల ప్రమాణమును మించరాదు : అనగా జర్మానా మొత్తము ఏబది రూపాయలకు మించనపుడు రెండు మాసములకు మించని ఎంత కాలావధియైనను" జుర్మానా మొత్తము ఒక వంద రూపాయలకు మించనపుడు లుగు మాసములకు మించని ఎంత కాలావధియైనన్న ఏ ఇతర కేసులోనైనను ఆరు మాసములకు మించని ఎ కాలావధియైనను కావచ్చును.

జుర్మానా చెల్లించిన మీదట కారావాసము అంతమగుట.

68. జుర్మానా చెల్లించని పక్షమున విధింపబడిన కారావాసము, ఆ జుర్మానా చెల్లించినపుడుగాని శాసన ప్రక్రియ ద్వారా వసూలు అయినపుడుగాని, అంతమగును.

జూర్మానాలో ఆనుపాతిక భాగము చెల్లించిన మీదట కారావాసము అంతమగుట.

69. జుర్మానా చెల్లించని పక్షమున నియతము చేసిన కారావాసపు కాలావధి ముగియుటకు పూర్వము, కొంత జుర్మానా చెల్లింపబడినచో, లేక వసూలు చేయబడినచో, ఇంకను చెల్లింపవలసిన జుర్మానా ఆనుపాతిక భాగము జుర్మానా చెల్లించనందుకు అనుభవించిన కారావాస కాలావధి ఆనుపాతిక భాగముకంటె తక్కువ కాకుండుచో, ఆ కారావాసము అంతమగును.

ఉదాహరణము

'ఏ' కు ఒక వంద రూపాయల జూర్మానాయు, ఆ జూర్మానా చెల్లించని పక్షమున నాలుగు మాసముల కారావాస దండనయు విధింపబడినవి. ఇచట కారావాసపు గడువులో ఒక మాసము పూర్తి యగుటకు పూర్వము డెబ్బది అయిదు రూపాయల జుర్మానా చెల్లింపబడినయెడల లేక వసూలు చేయబడిన యెడల, మొదటి మాసము పూర్తి కాగానే, 'ఏ' విడుదల చేయబడును. మొదటి మాసము పూర్తి యగు సమయమున లేక ఆ తరువాత 'ఏ' కారావాసముతో ఉంటూ ఉండగా ఎప్పుడైనను డెబ్బది అయిదు రూపాయలు చెల్లింపబడినచో లేక వసూలు చేయబడినచో, తత్ క్షణమే 'ఏ' విడుదల చేయబడును. కారావాసపు గడువులో రెండు మాసములు పూర్తి యగుటకు పూర్వము ఏబది రూపాయల జూర్మానా చెల్లింపబడినచో లేక వసూలు చేయబడినచో, రెండు మాసములు పూర్తి కాగానే 'ఏ' విడుదల చేయబడును.