పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

బోయర్ యుద్ధం


మరియు భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ మెంబర్లతో సంబంధం పెట్టుకొని వున్నారు. వారు భారత సివిల్ సర్వీస్‌కు సంబంధించి రిటైరైన ఆధికారి భారత మంత్రి కార్యాలయం అధినివేశమంత్రి కార్యాలయంతో కూడా మంచి సంబంధం పెట్టుకొని పని చేశారు. తాను వెళ్ల గలగినంత దూరం వెళ్లి భారతీయుల కోసం ఇంగ్లాండులో అవిరళకృషి చేశారు. తత్ఫలితంగా, దక్షిణాఫ్రికా యందలి భారతీయుల స్థితి గతుల వ్యవహారం బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిలో ప్రథమ స్థానం ఆక్రమించింది. దానివల్ల మంచిలేక చెడు ప్రభావం మిగతా అధినివేశరాజ్యాల మీద పడింది ఏ ఏ అధినివేశ రాజ్యాల్లో భారతీయులు నివసించి యున్నారో వారందరిలో చైతన్యం వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న ఆయా రాజ్యల యందలి శ్వేత జూతీయులు భారతీయులు తమ రాజ్యాలలో ఏఏ ప్రమాదాలు తమకు కలిగించగలరోనని జాగ్రత్త పడ్డారు.



9

బోయర్ యుద్ధం

గత ప్రకరణాలు శ్రద్దగా చదివిన పాఠకులకు బోయర్ యుద్ధం జరిగినప్పుడు భారతీయుల స్థితిగతులు దక్షిణాఫ్రికాలో ఎలా వున్నాయో బోధపడియుండవచ్చు. తమ స్థితిని సరిదిద్దుకునేందుకై వారు చేసిన ప్రయత్నాలు కూడా బోధపడివుంటాయి

డా॥ జెమిసస్ బంగారు గనుల యజమానులతో జరిపిన చర్చల తరుపాత ఆ ప్రకారం అతడు 1899లో జోహన్స్‌బర్గ్ మీద దాడి చేశాడు. జోహన్స్‌బర్గు మీద అధికారం పొందిన తరువాతనే బోయర్ ప్రభుత్వానికి దాడి విషయం బోధపడుతుందని భావించాడు. అలా అనుకొని డా॥ జెమిసస్. అతని అనుచరులు చాలా పొరపాటు చేశారు. మరో తప్పు కూడా వాళ్లు చేశారు మన కుట్ర బయటపడినప్పటికీ రోడేషియాలో శిక్షణ పొందిన గురికాండ్ల