పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

75


సాయం లభిస్తూ వుండేది. మాకు ఎన్నో అమూల్యమైన సూచనలు యిస్తూ వుండేవారు దక్షిణాఫ్రికా యందలి భారతీయుల సమస్యల్ని అర్థం చేసుకొని, అందుకు అవసరమైన సలహాలు సర్ విలియం ఎల్సన్ హంటర్ యిస్తూ వుండేవారు వారు "టైమ్సు" యందలి భారతీయ విభాగానికి సంపాదకులు మేము వారికి దక్షిణాఫ్రికా భారతీయుల స్థితిగతులను గురించి బాబు వ్రాశాము అప్పటినుంచి వారు టైమ్సు పత్రికలో భారతీయుల విషయమై శ్రద్ద వహించి వ్రాయడం ఆరంభించారు. మా కోరికల్ని తాము సమర్థించడమే గాక అనేక మంది పెద్దల అభిప్రాయాలు కూడా ప్రకటించి మా కృషికి సాయం చేశారు. మహత్తరమైన విషయాలపై ప్రతివారం వారి జాబు మాకు అందుతూ వుండేది వారు తమ మొదటి జూబులో "మీరు మీ స్థితిని గురించి వ్రాసిన విషయాలు చదివి నాకు దుఃఖం కలిగింది. మీరు వినమ్రతతో, శాంతిగా అతిశయోక్తులు లేకుండా పోరాటం జరుపుతున్నారు యీ విషయంలో నా సంపూర్ణ సానుభూతి మీ యెడ వున్నది. మీకు న్యాయం జరగాలి అందుకొసం నేను వ్యక్తి గతంగానేగాక. బహిరంగంగా కూడా చేయువలసిందంతా చేస్తాను యీ విషయంలో మనం ఒక అంగుళమైనా వెనుకంజవేయుటకు వీలు లేదు. తటస్థంగా వుండే ఏ వ్యక్తి యీ విషయంలో తగ్గమని చెప్పుడు చెప్పలేడు" అని వ్రాశారు. టైమ్సులో ప్రచురించిన తన వ్యాసంలో కూడా దరిదాపుగా పై విషమేవారు వ్రాశారు చివరి వరకు వారు మా విషయంలో అలాగే వ్యవహరించారు. లేడీ హంటర్ వ్రాసిన ఒక జాబులో "తన మృత్యు సమయానికి పూర్వమే, దక్షిణాఫ్రికా భారతీయుల విషయంలో వ్రాయదలచుకున్న వ్యాసాల రూపురేఖలు తయారు చేశానని" పేర్కొన్నారు.

శ్రీమాన్ నాజర్‌గారి పేరు గత ప్రకరణంలో పేర్కొన్నాను భారతీయుల అభిప్రాయాల్ని చక్కగా నివేదించుటకు వారిని దక్షిణాఫ్రికా భారతీయులందరి పక్షాన ఇంగ్లాండుకు పంపించాము వివిధ పార్టీల వారందరితో సంబంధం పెట్టుకొని యీ పని చేయమని వారికి చెప్పాము వారు ఇంగ్లాండులో వున్నంతకాలం కీ॥శే॥ సర్ విలయం విల్సన్ హంటర్, సర్‌మంచర్జీ భావనగరీ,