పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

భారతీయులు ఏం చేశారు? -2

అలెగ్జాండరు తీయగా, హాస్యంగా, తమాషాగా పై విషయాలు మెల్లమెల్లగా చెప్పేసరికి తెల్లవాళ్లంతా తెల్లబోయారు ఆయన చెప్పిన ప్రకారం ఒక కమిటీనిఎన్నికొని లోనికి పంపించారు. వాళ్లులోపలికి వెళ్లి తిరిగివచ్చి గాంధీలేడని, చెప్పివేశారు. తెల్లవారంతా ఎవరిదోవన వాళ్లు యిచ్చిన మాట ప్రకారం రుస్తుంజీ యింటికి హాని తలపెట్టకుండా వెళ్లిపోయారు. ఇది ది 1 జనవరి 1897 నాడు జరిగిన ఘట్టం

ఆరోజున ఉదయమె, యాత్రీకుల మీద విథించిన ఆంక్ష తొలగించిన తరువాత ఒక పత్రికా విలేఖరి నా దగ్గరికి వచ్చాడు. అతడికి భారతదేశంలో జరిగినవిషయాల్ని, నా పత్రికా ప్రకటనల్ని, సవివరంగా వివరించి, కాగితాల్ని కూడా అందజేశాను నేను చెప్పిన విషయాలలో అతిశయోక్తి లేదు. సత్యాన్ని మాత్రమే చెప్పాను. సత్యం చెప్పడం నా కర్తవ్యంగా భావించాను అని కూడా చెప్పాను మర్నాడు అక్కడి పత్రికలన్నింటిలోను నా వాంగ్మూలం సవివరంగా విస్తృతంగా వెలువడింది. చదువుకున్న తెల్లవాళ్లంతా తృప్తిపడ్డారు. అసలు విషయం అక్కడి వాళ్లకందరికీ తెలిసిపోయింది. పత్రికల వారంతా అక్కడి తెల్లవారిని సమర్థిస్తూ, నన్ను ఏమీ తప్పుపట్టకుండా గాంధీచేసింది సరియైన పనే తప్పు వార్తలను నమ్మడం సరికాదని వ్యాఖ్యలు ప్రకటించారు. దానితో అక్కడ నా ప్రతిష్ఠ పెరగడమే గాక, భారతజాతి గౌరవం కూడా ఇనుమడించింది అక్కడి భారతీయులు పిరికిపందలుకారని, భారతీయ వ్యాపారస్తులు గౌరవప్రదంగా తలయెత్తి వ్యాపారం చేసుకోవచ్చుననీ, చేసుకోగల సమర్దులని కూడా వారికి భావం కలిగింది

జరిగిన గొడవవల్ల జాతి ఎన్నో కష్టాలు సహించవలసి వచ్చింది. దాదా అబ్దుల్లాకు కలిగిన నష్టం ఇంతింత కాదు. అయితే దీనివల్ల చివరికి మేలే జరిగిందని నా భావం జాతికూడా తన శక్తి ఏమిటో తెలుసుకున్నది. దాని ఆత్మ విశ్వాసం పెరిగింది. శిక్షణ కూడా లభించింది. ఆ విషయాల్ని గురించి యిప్పుడు యోచిస్తే భగవంతుడు నన్ను సత్యాగ్రహోద్యమం నడుపుటకు తయారుచేస్తున్న సమయం అది అని అనిపిస్తున్నది

నేటాలులో జరిగిన యీ ఘట్టాల తీవ్ర ప్రభావం ఇంగ్లాండుపై పడింది శ్రీ చాంబర్లెస్ వెంటనే నేటాల్ ప్రభుత్వానికి తంతి పంపించి గాంధీగారిమీద