పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

71


దాడి చేసిన తెల్లజాతి వారందరి మీద కోర్టులో కేసు నడపమని, గాంధీగారికి న్యాయం జరపమని ఆదేశించారు. శ్రీ ఎస్కంబ్ అప్పుడు నేటాల్ ప్రభుత్వ అటార్నీ జనరల్‌గా వున్నారు. ఆయన నన్ను పిలిపించుకొని చేంబర్లెస్ పంపిన తంతి విషయం చెప్పాడు. ప్రమాదం తొలగినందుకు నాకు శుభాకాంక్షలు అందజేశాడు. మీకు గాని మీ జాతివారికి గాని దెబ్బలు తగలడం, బాధ కలగడం నాకు యిష్టం లేదు. తెల్లవాళ్లు మిమ్మల్ని కొడతారేమోనని భయపడి నేను మీరు పగలు దిగవద్దు అని సలహా పంపాను నా సలహా మీకు నచ్చలేదు. మీరు మి॥లాటస్ సలహా అంగీకరించారు. ఆందుకు నేను మిమ్ము దోషం పట్టడం లేదు. మీకు నచ్చినట్లు మీరు చేయవచ్చు తప్పులేదు చేంబర్లెస్ కోరిన విషయంతో నేటాలు ప్రభుత్వం ఏకీభవిస్తున్నది దోషులకు దండన విధించితీరాలి దాడిచేసిన వారిని మీరు గుర్తించగలరా అని ప్రశ్నించాడు

ఇద్దరు ముగుర్ని గుర్తించడం సాధ్యమే కాని ఒక విషయం స్పష్టంచేస్తున్నాను ఎవరో ఏదో అన్నాడని చెప్పేసరికి నమ్మి ఆవేశపడి నన్ను హింసించిన వారిపై ఏ మాత్రమూ నాకు కక్షలేదు కార్పణ్యం లేదు. వాళ్లమీద కోర్టులో కేసు పెట్టసు. నిజానికి యిందు వారి దోషం ఏమీ లేదు. తమ నాయకులు ఏదో చెబితే వాళ్లు నమ్మారు. నాయకులు చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచించుటకు వారికి సమయం చిక్కలేదు నన్ను గురించి చెప్పుడు మాటలులు వినడం, వాటిని నమ్మడం, నా మీద వారు చేయి చేసుకోవడం సహజమే మందిని రెచ్చగొడితే సహజంగా యిదే జరుగుతుంది అసలు జరిగిన దానిలో తప్పంతా మీ తెల్లవారు ఎన్నుకున్న కమిటీది ఆ కమిటీకి బోధ చేసిన మీది మీ నేటాల్ ప్రభుత్వం వారిది. నేను భారత దేశంలో ఏమేమో మిమ్మల్ని అన్నానని రూటరు ప్రతినిధి ఎవరో వార్త పంపాడు. ఆ వార్త మీరు చదివారు. మీకు కోపం వచ్చింది. ఆ తరువాత నేను నేటాలు వస్తున్నానని మీకు తెలిసింది రాగానే మీరుగాని, మీ ప్రభుత్వం వారు గాని, మీ కమిటీవారుగాని నన్ను కలిసి వాస్తవం ఏమిటి అని అడిగి తెలుసుకోవద్దా? అట్టి అవసరమే లేదా? నా జవాబు విని మీరు ఒక నిర్ణయానికి వచ్చి యుంటే యింత రగడ జరిగి యుండేదేకాదు ఇదేమీ