పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

47


గారి భాగస్వామి నేటాలును గురించి పోర్‌బందరులో నాకు చెప్పిన మాటలకు. యిక్కడ నాకు కనబడ్డ దృశ్యాలకు ఎంతో వ్యత్యాసం కనబడింది అయితే యిందులో అతని దోషం ఏమీ లేదు. నిరాడంబరత్వం, అమాయకత్వం ఆయనకు వాస్తవపరిస్థితులు తెలియక పోవడం అందుకు కారణం నేటాలులో భారతీయులు అనుభవిస్తున్న కష్టాలు ఏమిటో ఆయనకు తెలియవు తెల్లవాళ్లు చేసే అవమానాలు వారికి ఆవమానాలని అనిపించలేదన్నమాట అక్కడ అడుగు పెట్టిన నాడే భారతీయుల ఎడ తెల్లవాళ్లు అవలంభించే అవమానకరమైన చేష్టలు ఏమిటో నాకు బోధపడ్డాయి

నేటాలు చేరిన పదిహేనురోజుల్లోనే నాకు ఎన్నో కటు ఆనుభవాలు కలిగాయి త్రోవలో దెబ్బలు తినవలసి వచ్చింది. హోటళ్లలో వుండటానికి అక్కడచోటు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. అక్కడ హోటళ్లలో చోటు దొరకడం అసంభవం ఆ ఘట్టాల వివరాల్లోకి నేను పోదలచలేదు. ఆకటు అనుభవాలు నా రోమరోమానికి హత్తుకు పోయాయని మాత్రం చెప్పగలను నేను ఒక్క కేసు విషయంలో పని చేయుటకు అక్కడకు వెళ్లాను. అందు నాకు స్వార్థం వున్నది అనుభవంగడించాలనే ఉత్సాహం వున్నది. అందువల్ల ఆ సంవత్సరమంతా కటు అనుభవాలు అనుభవిస్తూ సాక్షిగా వుండిపోయాను. నా కార్యక్రమ ప్రారంభం అప్పటినుంచి జరిగింది నా స్వార్థం కోసం దక్షిణాఫ్రికా రావడం నాకు విశేషమనిపించలేదు అవమానాలు, తిరస్కారాలు లభించే చోట వుండి ధనం సంపాదించడానికి నా దృష్టిలో విలువ పోయింది యాత్రలు చేయాలనే కోరికకూడా తగ్గిపోయింది అది నాకు సుతరామూ యిష్టం లేదు. నేను ధర్మ సంకటంలో పడిపోయాను నా ఎదుట రెండు మార్గాలు వున్నాయి. భారతదేశంలో వున్నప్పుడు ఏమాత్రమూ తెలియని దక్షిణాఫ్రికా పరిస్థితుల్ని కండ్లారా చూచి, అనుభవించి సంవత్సరంపాటు చేసుకున్న ఒప్పందం ప్రకారం వుండి, ఆ తరువాత తక్షణం భారత దేశానికి తిరిగి వెళ్లిపోవడం ఒక మార్గం. అక్కడ వుండి ఏది ఏమైనా సరే ప్రారంభించిన పని పూర్తి చేయడానికి పూనుకోవడం రెండవ మార్గం. నేను విపరీతమైనచలిలో, మెరిత్స్‌బర్గ్ రైలుస్టేషన్లో, రైల్వే పోలీసుల దెబ్బలు