పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

భారతీయులు ఏం చేశారు? -1

1893 ఏప్రిల్ మాసంలో భారతదేశం వదిలి నేను దక్షిణాఫ్రికాకు బయలుదేరాను నాకు గిర్‌మిటియాల చరిత్ర తెలియదు. నేను స్వార్ధం కొసమే అక్కడికి వెళ్లాను డర్బన్‌లో పోర్‌బందరుకు చెందిన ముస్లిం దాదా అబ్బుల్లా పేరిట ఒక ప్రసిద్ధ వ్యాపార సంస్థవున్నది. అంత ప్రసిద్ధిగల వ్యాసారసంస్థ మరొకటి వీరికి పోటీగా వున్నది. ఇది పోర్‌బందర్‌కి చెందిన తయ్యబ్‌హాజీఖాన్ మహమ్మద్ గారి వ్యాపార సంస్థ అది ప్రిటోరియాలో వున్నది దురదృష్టవశాత్తు వీరిద్దరిమధ్య కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది దాదా అబుల్లా గారి భాగస్వామి ఒకడు పోర్‌బందరులో వున్నాడు. నావంటి క్రొత్త బారిష్టరు దక్షిణాఫ్రికా వెళితే తమ కేసు కొంత సులువుగా సాగుతుందని భావించాడు నావంటి అనుభవంలేని క్రొత్త బారిష్టరు ప్రవేశించడం వల్ల తమ వ్యాజ్యం దెబ్బతింటుందని ఆయన అనుకోలేదు. అక్కడ కోర్టుకు వెళ్లి నేను వాదించనవసరం లేదు. వారి పక్షాన వాదిస్తున్న ధురంధరులైన వకీళ్లకు, బారిష్టర్లకు దుబాసీగా వుండి కేసుల్ని గురించి వివరాలు చెబుతూ సహకరించాలి నాకు క్రొత్త అనుభవాలు గడించాలనే కోరిక వున్నది. యాత్ర చేయడం నాకు యిష్టమే బారిష్టరుగా పని చేస్తూ నా దగ్గరికి కేసులు తీసుకు వచ్చే దళారులకు కమీషన్ యివ్వడం నాకు విషంతో సమానంగా వున్నది కారియావాడ్ (సౌరాష్ట్ర) యందలి గొడవలు, కుట్రలు చూచి నాకు చిరాకు వేసింది. ఒక సంవత్సరం కాలం మాత్రమే ఒప్పందం చేసుకున్నాము యీ ఒప్పందం నాకు నచ్చింది. యిందునాకు కలిగే నష్టమేమీ లేదు రాకపోకలకు, అక్కడ వుండుటకు అయ్యే ఖర్చంతా దాదా ఆబ్దుల్లాయే భరిస్తారు. యిది గాక పని చేసినందుకు 105 పౌండ్లు పీజు విడిగా యిస్తారు. యీ ఏర్పాటంతా కీర్తిశేషులు మా పెద్దన్నగారు చేశారు. వారు నాకు పిత్రుతుల్యులు వారి సౌకర్యమే నా సౌకర్యం నేను దక్షిణాఫ్రికా వెళ్లడం వారికి యిష్టం అందువల్ల నేను 1893 మేలో డర్భన్ చేరాను.

ఇక బారిష్టర్ దర్జాను గురించి నన్ను అడగాలా? నా లెక్క ప్రకారం ఫ్రాంక్ కోటు, నెక్‌టై మొదలగు వాటిని ధరించి దర్జాగా ఓడ నుంచి డర్బన్ హార్బరులో దిగాను దిగంగానే నా కండ్లు తెరుపుడు బడ్డాయి దాదా అబ్దుల్లా