పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

45


కూలీ అనే శబ్దం వాడుతూ వుండేవారు. యిది చాలా మంది భారతీయులకు యిష్టం లేదు. అందువల్ల స్వతంత్ర భారతీయులు తాము గిర్‌మిటియాలం కామని చెప్పి ప్రత్యేక గుర్తింపుకోసం ప్రయత్నిస్తూ వుండేవారు. అందువల్ల స్వతంత్ర భారతీయులు, గిర్‌మిటియా కార్మికులు. గిర్‌మిటియా ప్రధనుంచి ముక్తి పొందిన వారు అను తేడా దక్షిణాఫ్రికా భారతీయుల్లో బయలు దేరింది

దుఃఖ సముద్రాన్ని అరికట్టుటకు స్వతంత్ర భారతీయులు ముఖ్యంగా ముస్లిం వ్యాపారస్తులు పూనుకున్నారు. గిర్‌మిటియా కార్మికుల సహాయంగాని, గిర్‌మిటియా ప్రధనుంచి ముక్తి చెందిన వారి సహాయంగాని వారు తీసుకోలేదు. అలా చేయాలనే భావం కూడా అక్కడ ఎవ్వరికీ తట్టలేదు. తట్టినా వాళ్లను చేర్చుకుంటే కార్యం చెడిపోయే ప్రమాదం వున్నది అసలు దాడి జరుగుతున్నదంతా స్వతంత్ర భారతీయ వ్యాపార వర్గం మీదనే కనుక రక్షణ దృష్ట్యా కూడా యిలా భావించడం జరిగింది. యిటువంటి కష్టాలు ఎన్ని వచ్చినా, ఇంగ్లీషురాకపోయినా, ప్రజా సేవా రంగంలో పని చేసిన అనుభవం పొందక పోయినా, స్వతంత్ర భారతీయ వ్యాపారస్తులు మాత్రం కష్టాల్ని గట్టిగా ఎదుర్కొన్నారని చెప్పక తప్పదు వాళ్లు ఆంగ్ల బారిష్టర్ల దగ్గరికి వెళ్లి వాళ్ల చేత అర్జీలు తయారు చేయించి ప్రభుత్వానికి పంపించారు ప్రతినిధి బృందాల్ని కూడా పంపించారు. అవకాశం వున్న ప్రతిచోట వారు అన్యాయాల్ని తీవ్రంగా ప్రతిఘటించారు. 1893 వరకు స్థితి యిలాగే వున్నది

ఈ పుస్తకాన్ని అర్థం చేసుకొనుటకు పాఠకులు కొన్ని తేదీలు జ్ఞాపకం పెట్టుకోవడం అవసరం పుస్తకం చివర ముఖ్య ఘట్టాల అనుబంధంలో వాటి తేదీలతో బాటు యివ్వడం జరిగింది. వాటిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వుంటే అక్కడి సత్యాగ్రహ చరిత్ర తేలికగా బోధపడుతుంది 1893 నాటికి ఆరెంజ్ ఫ్రీ స్టేటులో భారతీయుల అతీగతీ లేకుండా పోయింది. ట్రాన్స్‌వాల్‌లో 1885 నాటి బిల్లు యందలి 3వ నిబంధన అమలులోకి తేవడం జరిగింది. నేటాలులో కేవలం గిర్‌మిటియాలు మాత్రమే వుండుటకు వీలుగాను, మిగతా భారతీయులు వుండుటకు వీలులేని విధంగాను నిర్ణయాలు గైకొనుటకు జవాబుదారీ ప్రభుత్వ ఏర్పాటుజరిగింది.