పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

భారతీయులు ఏం చేశారు? -1


ఇంగ్లీషు తెలిసినవారిలో ఎక్కువ మంది క్లర్కులు తమ వృత్తి నెరవేర్చగలంతవరకే వారికి ఇంగ్లీషు తెలుసు ఆర్జీలు వ్రాయలేరు. పూర్తి సమయం తమ యజమానుల కోసం వెచ్చిస్తూ వుండేవారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన, ఇంగ్లీషు తెలిసినవారు కొందరున్నారు. వాళ్లు గర్‌మిటియాల సంతతికి చెందినవారు. వాళ్లు కొద్దిగా యోగ్యత పెంచుకొని కోర్టుల్లో దుబాసీలుగా ప్రభుత్వ నౌకరీలు చేసుకుంటున్నారు. భారతీయుల స్థితిచూచి సానుభూతిని మాత్రమే వెల్లడించి వూరుకునేవారు. అదే వారు చేయగలిగిన గొప్ప సేవ

గిర్‌మిటియాలు. గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన వారు అధికంగా ఉత్తర ప్రదేశ్ మరియు మద్రాసుకు చెందిన వారు స్వతంత్ర భారతీయుల్లో గుజరాత్‌కు చెందిన మహమ్మదీయ వ్యాపారస్తులు హిందూ గుమాస్తాలు, మెహతాలు వున్నారు. వీరు గాక కొద్దిమంది పారసీ వ్యాపారస్తులు, క్లర్కులు వున్నారు. దక్షిణాఫ్రికా యందంతట వున్న పారసీకుల సంఖ్య 30 లేక 40 మందిని మించి లేదు. స్వతంత్ర్య వ్యాపారుల్లో నాలుగోవర్గం సింధీలు సింధీలు భారతదేశం వదిలి బయటికి వెళ్లి ఫాన్సీ గూడ్సు వ్యాపారులుగా గుర్తింపు పొందారు. పాన్సీ గూడ్సు షాపుల్లో వారు ప్రత్యేకించిపట్టు, జరీ సామాను, నగిషీ చెక్కిన అద్దాలు, చందనం, రకరకాల ఏనుగు దంతాల పెట్టెలు, యిటువంటివే గృహ సంబంధమైన వస్తువులు అమ్ముతూ వుంటారు వారి దగ్గర సొమానుకొనే వారంతా అక్కడ సామాన్యంగా ఆంగ్లేయులే

గిరిమిటియా కార్మికుల్ని తెల్లవాళ్లు కూలీలని పిలిచేవారు. కూలీ అంటే బరువులు మోసే కార్మికుడన్నమాట కూలీ శబ్దం బాగా ప్రచారం పొందింది గిరిమిటియా కార్మికులు సైతం మీరెవరు అని అడిగితే కూలీలం అని సమాధానం చెబుతూ వుండేవారు. ఆ తరువాత మెల్లమెల్లగా భారతీయులందరికీ కూలీ అనే శబ్దం రూఢమై పోయింది. ఇంగ్లీషువాళ్లు భారతీయ వకీళ్లను కూలీవకీళ్లు అవి, భారతీయ వ్యాపారస్తుల్ని కూలీ వ్యాపారస్తులని అనడం ప్రారంభించారు. యీ విశేషణం వాడటం తప్పని చాలా మంది ఇంగ్లీషు వాళ్లకు తెలియదు. అయితే చాలా మంది తిరస్కారభావం ప్రకటించడానికే