పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

39


ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం "తాము అంగీకరించిన చట్టానికి పెద్ద ప్రభుత్వమే ముందునుంచి స్పష్టంగా రహస్యంగా అంగీకరించింది" అని ప్రకటించింది.

ఈ విధంగా యిరుపక్షాలకు అభిప్రాయభేదం వచ్చినందున మధ్యవర్తుల ముందు యీ విషయాన్ని ప్రవేశపెట్టారు. మధ్యవర్తుల నిర్ణయం తటపటాయింపులతో నిండిపోయింది. వాళ్లు రెండు ప్రభుత్వాలను తృప్తి పరుచుటకు ప్రయత్నించారు. దానివల్ల నష్టపడింది భారతీయులే దాన్ని లాభం అని అనుకుంటే ఎక్కువ నష్టానికి బదులు తక్కువ నష్టం కలగడమే కలిగిన లాభం అని భావించాలి మధ్యవర్తుల నిర్ణయ ప్రకారం బిల్లు నందు 1886 లో మార్పులు జరిగాయి. 25 పౌండ్లకు బదులు 3 పౌండ్లుగా నిర్ణయం జరిగింది. భూమి కొనుక్కునే విషయంలో కూడా మార్పు జరిగింది ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం నిర్ణయించిన చోటనే భారతీయులు భూమి కొనుక్కొనుటకు వీలు కల్పించబడింది యీ నిబంధనను అమలు బరుచునప్పుడు కూడా వక్రత వారి మనస్సుల్లో చోటు చేసుకున్నది. ప్రభుత్వం నిర్ధారించిన వాడల్లో సైతం కొనుక్కున్న చోటు మీద కూడా భారతీయులకు స్థిరంగా హక్కు యివ్వలేదు. పట్టణాలకు దూరుగా మురికి చోట్ల భారతీయులకు వాడలు నిర్ధారించారు. నీటికొరత, కరెంట్ కొరత, పాయిఖానాల శుభ్రత కొరత వున్న ప్రదేశాల్లో భారతీయులు వుండాలని తెల్లవాళ్ల నిర్ణయం యీ విధంగా ట్రాన్స్‌వాల్లో భారతీయులు పంచమజాతి వాళ్లుగా పరిగణించబడ్డారు. మనదేశంలో గల అస్పృశ్యుల గూడెముల మాదిరి స్థితిలో ట్రాన్స్‌వాల్ గూడెములు వెలిశాయన్న మాట. భారతదేశంలో పాకీవాళ్లకు, మాలమాదిగల ప్రక్కన వున్నాలేక వారిని ముట్టుకున్నా తాము అపవిత్రమై పోతామని హిందువులు భావిస్తున్నట్లే ట్రాన్స్‌వాల్ యందలి తెల్లవాళ్లు భారతీయుల ప్రక్కన వుంటే తాము అపవిత్రులమై పోతామని భావించారు 1985 నాటి చట్టమునందలి 3వ నిబుధనకు, వేరే అర్థం తీసి అక్కడి ప్రభుత్వం భారతీయ వ్యాపారులు, ఆవాడల్లోనే ఆ లొకేషన్లలోనే వ్యాపారం చేసుకోవచ్చునని నిర్ణయించారు. యీ నిర్ణయం సరియైనదా కాదా అని నిర్ణయించు అధికారం కోర్టులకు ప్రభుత్వం అప్పగించింది. దానితో